Pension : పెన్షన్ రూ.3 వేల నుండి రూ.7 వేలు అందుకున్న ఆనందం తో డాన్సులు చేస్తున్న లబ్ధిదారులు

పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు చంద్రబాబు ను దేవుడు గా కొలుస్తూ..వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు

  • Written By:
  • Publish Date - July 1, 2024 / 02:16 PM IST

ఏపీలో పెన్షన్ (Pension) లబ్ధిదారుల సంబరాలు అంబరాన్ని తాకాయి. చంద్రన్న వస్తేనే మా బతుకులు బాగుపడతాయాని నమ్మి ఓటు వేసిన వారి నమ్మకాన్ని నిలబెట్టారు బాబు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ రూ. 4000 వేలు చేస్తామని..ఏప్రిల్‌ నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు గాను 1,000 చొప్పున కలిపి మొత్తం 7 వేలు నేడు పంపిణీ చేస్తున్నారు. అలాగే దివ్యాంగులకు, బహుళ వైకల్యం సంభవించిన వారికి ఒకేసారి 3 వేల పెంచి 6 వేల రూపాయల చొప్పున అందిస్తున్నారు.

పక్షవాతం, తీవ్రమైన కండరాల లోపం ఉన్న వారికి, ప్రమాద బాధితులకు, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడినవారికి, వీల్‌ఛైర్‌లో ఉన్న వారికి అందే రూ.5 వేల పింఛన్‌ను రూ.15 వేలకు పెంచారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడీ చేసుకున్న వారికి, డయాలసిస్‌ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు పింఛను కింద అందే రూ.5 వేలను రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకొని ఆ విధంగా పెన్షన్ ఇస్తున్నారు. పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. తొలి రోజే 100 శాతం పంపిణీ పూర్తయ్యేలా అధికారులు చూస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

2014లో టీడీపీ అధికారం చేపట్టగానే 200 నుంచి వెయ్యి రూపాయలకు ఒకేసారి 5 రెట్లు పెంచింది. ఆ తర్వాత మరో విడత వెయ్యి నుంచి 2 వేలు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం 2019-24 మధ్య ఏడాదికి 250 చొప్పున నాలుగు విడతల్లో వెయ్యి రూపాయిలు పెంచింది. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ ఒకేసారి రూ. 4 వేలు ఇస్తుండడం తో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు చంద్రబాబు ను దేవుడు గా కొలుస్తూ..వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది రోడ్ల పైకి వచ్చి డాన్సులు చేస్తున్నారు. మిగతా హామీలు కూడా త్వరగా అమలు చేయాలనీ ఈ సందర్బంగా వారంతా కోరుతున్నారు.

Read Also : Polavaram Project : పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుందని..సీఎంను ప్రశ్నించిన మహిళ