Site icon HashtagU Telugu

Pakistanis : ఏపీలో 21 మంది పాకిస్థానీయులకు నోటీసులు

Notices Issued To 21 Pakist

Notices Issued To 21 Pakist

ఆంధ్రప్రదేశ్‌(AP)లో ఉన్న 21 మంది పాకిస్థానీయులకు (Pakistanis ) ప్రభుత్వం నోటీసులు (Govt Notice) జారీ చేసింది. తమ వీసా గడువు ముగిసిన నేపథ్యంలో, వీరు వెంటనే దేశం విడిచిపోవాలని అధికారులు ఆదేశించారు. ఇందులో ఆరుగురు మెడికల్ వీసాతో భారత్‌కు వచ్చిన వారు కూడా ఉన్నారు. వీరికి ప్రత్యేకంగా రెండు రోజులు గడువు ఇచ్చారు, ఈ వ్యవధిలోగా దేశాన్ని వదిలి వెళ్లాలని స్పష్టంగా చెప్పింది ప్రభుత్వం.

POK Floods : పాక్ ఆక్రమిత కశ్మీరులో వరదలు.. భారత్ పనే అంటున్న పాక్

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అదే క్రమంలో తిరుపతి వంటి ప్రధాన పుణ్యక్షేత్రాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఆలయ పరిసరాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విశ్రాంతి గృహాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

తిరుపతి పోలీసు విభాగం విస్తృత తనిఖీలతో పాటు సీసీ టీవీ నిఘాను మరింత పెంచింది. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి తక్షణమే విచారణకు తీసుకుంటున్నారు. భక్తుల భద్రతకు ఎలాంటి లోటు ఉండకూడదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే పర్యటించే ప్రతి ప్రాంతంలో భద్రతా సిబ్బందిని పెంచి అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టారు.