Site icon HashtagU Telugu

Nominated Posts : జూన్‌ లోపు నామినేటెడ్ పదవులు భర్తీ : సీఎం చంద్రబాబు

Nominated posts to be filled before June: CM Chandrababu

Nominated posts to be filled before June: CM Chandrababu

Nominated Posts : ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇంఛార్జీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నామినేటెడ్ పదవుల భర్తీ, అభ్యర్థుల ఎంపికపై దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా నేతలు, మంత్రుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. జూన్‌లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి కంటే.. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలని సూచించారు.

ఐదేళ్ల కాలంలో ఇబ్బందులు పడ్డ వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని.. తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయని.. రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ఘన విజయానికి కారణమైన కార్యకర్తల రుణం తప్పకుండా తీర్చుకుంటానని తెలిపారు. దాంతోపాటూ ప్రజా వ్యతిరేక పనులు చేయవద్దని మంత్రులు, నేతలు, కార్యకర్తలకు సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యేలు, నేతలు కింది స్థాయి కార్యకర్తలను మర్చిపోకూడదని చెప్పారు. చిత్తశుద్ధితో పని చేస్తేనే ప్రజలు మళ్ళీ ఆదరిస్తారని దిశా నిర్దేశం చేశారు. అలాగే అన్నా క్యాంటిన్లు తెరిపించేందుకు కూడా ప్రయత్నించాలని చెప్పారు. వందరోజుల్లోనే మూతబడ్డ క్యాంటీన్లను తెరిపించేలా పనులు చేయాలని చెప్పారు.

7 నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టామన్న చంద్రబాబు.. ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని.. ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని నేతలకు సూచించారు. మెంబర్ షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సాహం ఇస్తామన్నారు. 2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని తేల్చిచెప్పారు.

Read Also: AP Tourism : రోజా సాధించలేనిది..కందుల దుర్గేశ్ సాధిస్తున్నాడు