రాప్తాడు నియోజకవర్గం.. పరిటాల ఫ్యామిలికి కంచుకోట. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అంతకముందు పెనుకొండ నియోజకవర్గంలో పరిటా రవీంద్ర పోటీ చేసి గెలుస్తూ వచ్చారు. జిల్లాలో తన హవాని కొనసాగించిన పరిటాల రవీంద్ర దుండగుల కాల్పుల్లో 2005లో మరణించారు. పరిటాల రవి మరణానంతరం ఆయన భార్య సునీత రాజకీయాల్లోకి వచ్చారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి రాప్తాడు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. పరిటాల కుటుంబానికి ప్రత్యర్థిగా రాప్తాడులో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఉన్నారు. 2009 నుంచి 2019 దాకా పరిటాల కుటుంబంపై పోరాడుతూనే ఉన్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న రాప్తాడులో పరిటాల ఫ్యామిలీని ఓడించి గత ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసింది. వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పరిటాల శ్రీరామ్‌పై పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. వైసీపీ హవాతో రాప్తాడులో గెలిచిన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక అనేక అవినితీ ఆరోపణలను మూటగట్టకున్నారు. తోపుదుర్తి బ్రదర్స్ నియోజకవర్గంలో చేసే అరాచకంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాప్తాడులో టీడీపీ కార్యకర్తలపై దాడులని పరిటాల కుటుంబం ఎదుర్కొంది. తోపుదుర్తి బ్రదర్స్‌కి శ్రీరామ్ మాస్ వార్నింగ్ ఇస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. ఇటు ధర్మవరం నియోజకవర్గానికి కూడా పరిటాల శ్రీరామ్ ఇంఛార్జ్‌గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ ధర్మవరం నుంచి, పరిటాల సునీత రాప్తాడు నుంచి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరగుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ నిరాకరించినట్లు సమాచారం. సోదరుల అవినీతి, ప్రకాశ్ రెడ్డిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగా ఆయనకు టికెట్ ఇవ్వడంలేదని అధిష్టానం చెప్పింది. దీంతో ఇక్కడ పరిటాల ఫ్యామిలీని ఢికొట్టాలంటే బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని అధిష్టానం భావిస్తుంది. ప్రకాశ్ రెడ్డి స్థానంలో గంగుల భానుమతిని రాప్తాడు అభ్యర్థిగా పోటీ చేసే అశకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న మద్దెలచెరువు సూరి భార్య రాప్తాడు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ప్రతక్ష్యమైయ్యారు. రాజకీయాలకు దాదాపుగా గుడ్ బై చెప్పిన గంగుల భానుమతి ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సాహంతోనే మరోసారి యాక్టివ్ అవుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. 2004 ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి పరిటాల రవీంద్ర పై గంగుల భానుమతి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత భానుమతి రాజకీయాలకు దాదాపుగా దూరంగానే ఉన్నారు. సూరి కుంటుంబానికి , పరిటాల కుటుంబానికి మధ్య ఉన్న వైరాన్ని వైసీపీ వాడుకోబోతుందనే చర్చ జరుగుతుంది.