YS Jagan Mohan Reddy: చిత్తూరు జిల్లాలో మారనున్న వైసీపీ సీట్లు ఇవే

అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేగం పెంచారు. ఏపీ వ్యాప్తంగా అభ్యర్థులను మార్చే అంశం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. టిక్కెట్లు ఇచ్చేది లేదని జగన్ ఇప్పటికే ప్రజాప్రతినిధులకు చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
YS Jagan Mohan Reddy:

YS Jagan Mohan Reddy:

YS Jagan Mohan Reddy: అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేగం పెంచారు. ఏపీ వ్యాప్తంగా అభ్యర్థులను మార్చే అంశం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. టిక్కెట్లు ఇచ్చేది లేదని జగన్ ఇప్పటికే కొందరు ప్రజాప్రతినిధులకు చెప్పారు. ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వనని, భవిష్యత్తులో అందర్నీ చేరదీస్తానని జగన్ హామీ ఇచ్చారు. కానీ నేతలు మాత్రం ముఖ్యమంత్రి హామీలతో సంతృప్తి చెందక పక్క పార్టీల వైపు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఐదుగురికి సీట్లు ఇవ్వకపోవడంపై చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా జగన్ ఇప్పటికే ప్రజాప్రతినిధులకు సమాచారం అందించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కుప్పం మినహా మిగిలిన 13 స్థానాల్లో వైసిపి విజయం సాధించింది. ఈసారి కూడా అదే ఫలితాలు సాధించాలనే పట్టుదలతో వైసీపీ ఉంది.

ఈ నేపథ్యంలో ఐదు చోట్ల అభ్యర్థులను మార్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. చిత్తూరు, పలమనేరు, పూతలపట్టు, మదనపల్లె, సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారనున్నారు. ఇప్పటికే తమ స్థానాలకు కొత్త అభ్యర్థులను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నారాయణస్వామికి ఈసారి టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అక్కడ కొత్త అభ్యర్థిని ఉంచుతారు.

అయితే నారాయణస్వామి కోరిక మేరకు ఆయన కుమార్తెకు సత్యవేడు లేదా సూళ్లూరుపేటలో ఎక్కడో ఒక చోట టిక్కెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ మార్పులు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో చూడాలి.

Also Read: Jonna Murukulu: ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే జొన్న మురుకులు తయారు చేసుకోండిలా?

  Last Updated: 27 Dec 2023, 04:08 PM IST