వైసీపీ అధినేత వైఎస్ జగన్ (Jagan) మొట్టమొదటిసారి పార్టీ శ్రేణులకు స్వతంత్రంగా బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేశారు. ఈ నెల 1న మేడే సందర్భంగా జరిగిన సమావేశంలో జగన్ కీలక ప్రకటన చేస్తూ, జిల్లాల్లోనే కాకుండా మండల స్థాయిలో కూడా పార్టీని నడిపించే బాధ్యతలు మీకే ఇస్తా ఇందుకు కోసం మీరంత ముందుకు రావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇది వైసీపీ చరిత్రలో ప్రత్యేకమైన పరిణామం. గతంలో ఏ నిర్ణయం అయినా తాడేపల్లిలోని కేంద్ర నేతల సమ్మతితోనే తీసుకునే వారు. కానీ, ఈసారి జగన్ ప్రత్యక్షంగా బలమైన ఆఫర్ ఇచ్చారు.
Jammu and Kashmir : సరిహద్దు వాసులను రక్షించేందుకు 9,500 బంకర్లు ఏర్పాటు..!
అయితే ఈ బంపర్ ఆఫర్‌కు ఆశించిన స్పందన మాత్రం రావడం లేదు. జగన్ ఆఫర్ ఇచ్చి పదిరోజులు గడుస్తున్నా ఒక్కరు కూడా ముందుకు రావడంలేదు. పార్టీలో నాయకులూ ఉన్నారు, కార్యకర్తలూ ఉన్నారు కానీ పునర్నిర్మాణ దశలో ఉన్న పార్టీకి నాయకత్వం వహించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మునుపటి తరహాలో జగన్ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు సమాయత్తమవుతుంటే అప్పుడే మద్దతు ఇవ్వాలనే భావన కొంతమందిలో ఉంది. ప్రస్తుతం జగన్ కష్టకాలంలో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఎలాంటి ముందడుగు వేసిన ప్రమాదమే అని కార్యకర్తలు , నేతలు ఎవ్వరు ముందుకు రావడం లేదు.
Jaishankars Security: జైశంకర్‌కు బుల్లెట్ ప్రూఫ్ కారు.. 25 మంది నేతలకు భద్రత పెంపు
ఈ పరిణామాలతో వైసీపీ అంతర్గతంగా చర్చలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. సీనియర్ నాయకులు ఇప్పటికీ ఆశాభావం వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది పార్టీ భవిష్యత్తుపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందంటున్నారు. జగన్ ఇచ్చిన స్వేచ్ఛను నమ్మి ముందుకు వచ్చేవారి కోసం చూస్తున్న పార్టీ, రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చేసి, ప్రోత్సాహకాలు కల్పిస్తేనే కొత్త నేతలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఇప్పుడు కనిపించని నాయకత్వ స్పందన, భవిష్యత్‌లో జగన్ ముందుంచిన కొత్త రాజకీయ శైలికి పరీక్షగా మారనుంది.