Farmers : పెట్రల్, డీజిల్‌తో పని లేకుండా..ఆ యంత్రంతో ఆరు పనులు రైతులకు గుడ్ న్యూస్!

రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు రీగ్రో అనే సంస్థ ఓ కొత్త యంత్రాన్ని తీసుకువచ్చింది. క్రాప్ సిక్సర్ పేరుతో ఓ కొత్త యంత్రం రూపొందించింది. ఈ యంత్రం సాయంతో ఆరు రకాల వ్యవసాయ పనులు చేసుకోవచ్చు, పైగా పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. విశాఖలో జరిగిన ఆర్గానిక్ మేళా కార్యక్రమంలో దీనిని ప్రదర్శించారు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ క్రాప్ సిక్సర్ తోడుంటే.. రైతులను సహాయకారిగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. భారతదేశానికి వెన్నెముక వ్యవసాయ రంగం. అలాంటి వ్యవసాయ […]

Published By: HashtagU Telugu Desk
Farmers

Farmers

రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు రీగ్రో అనే సంస్థ ఓ కొత్త యంత్రాన్ని తీసుకువచ్చింది. క్రాప్ సిక్సర్ పేరుతో ఓ కొత్త యంత్రం రూపొందించింది. ఈ యంత్రం సాయంతో ఆరు రకాల వ్యవసాయ పనులు చేసుకోవచ్చు, పైగా పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. విశాఖలో జరిగిన ఆర్గానిక్ మేళా కార్యక్రమంలో దీనిని ప్రదర్శించారు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ క్రాప్ సిక్సర్ తోడుంటే.. రైతులను సహాయకారిగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

భారతదేశానికి వెన్నెముక వ్యవసాయ రంగం. అలాంటి వ్యవసాయ రంగం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఓ వైపు ప్రకృతి విపత్తులు, మరోవైపు గిట్టుబాటు ధరల సమస్యలను రైతన్నలను వెంటాడుతున్నాయి. వీటికి తోడు రోజురోజుకూ పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు.. వ్యవసాయాన్ని లాభసాటిగా కాకుండా నష్టాల పాలుజేస్తున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో.. పలుచోట్ల వ్యవసాయానికి కూలీలు కూడా లభించని పరిస్థితి. ఈ నేపథ్యంలో వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరిగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యల నుంచి రైతులను గట్టెక్కించేందుకు రీగ్రో అనే సంస్థ ఓ కొత్త పరికరం రూపొందించింది. క్రాప్‌ సిక్సర్‌ అనే పేరుతో సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించింది. ఈ యంత్రం సాయంతో ఆరు రకాల వ్యవసాయ పనులు చేసేందుకు వీలుంది. దీంతో ఈ పరికరానికి క్రాప్ సిక్సర్ అనే పేరు పెట్టారు.

క్రాప్ సిక్సర్ పరికరం సాయంతో దుక్కి దున్నడం మొదలుకుని.. కలుపుతీత వరకూ అనేక పనులు రైతులు సులభంగా చేసుకోవచ్చు. ఎరువుల పిచికారీ, చిన్న చిన్న కాలువలు, గోతులు తవ్వడం, పంట కోత, దుక్కి దున్నడం వంటి పనులు చేసుకునే వీలుంది. అలాగే ఈ క్రాప్ సిక్సర్ యంత్రానికి పెట్రోల్ , డీజిల్ వంటి ఇంధనాలు కూడా అవసరం లేదని రూపకర్తలు చెప్తున్నారు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ యంత్రాన్ని.. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎకరం వరకూ దుక్కి దున్నుకోవచ్చు. ఒక్క సారి ఫుల్ ఛార్జింగ్ కావటానికి సుమారుగా నాలుగు గంటల సమయం పడుతుంది. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో జరిగిన ఆర్గానిక్ మేళా కార్యక్రమంలో ఈ యంత్రాన్ని ప్రదర్శించారు.

మరోవైపు వ్యవసాయ రంగంలో ఇటీవలి కాలంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విప్లవాత్మక మార్పులను తెస్తోంది. రైతులు సెన్సార్లు, డ్రోన్లు వంటి పరికరాల సాయంతో నేలలోని తేమ, పోషకాలు, పంట ఆరోగ్యాన్ని అంచనా వేయగలుగుతున్నారు. అలాగే పురుగుల మందుల పిచికారీలనూ డ్రోన్ల వినియోగం ఎక్కువైంది. ఇక పొలంలో విత్తనాలు చల్లేందుకు, పంటకోత సమయాన్ని అంచనా వేయడానికి కూడా డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. జీపీఎస్ సాయంతో పనిచేసే ట్రాక్టర్ల సాయంతో దుక్కి దున్నడం, విత్తు పనులు చేపడుతున్నారు. పొలాల్లో నీటి పంపిణీ కోసం ఐవోటీని కూడా అక్కడక్కడా ఉపయోగిస్తున్నారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సాయంతో వ్యవసాయ రంగాన్ని మరింత సమర్థవంతంగా, లాభదాయకంగా, పర్యావరణ అనుకూలంగా మారుస్తున్నారు.

 

  Last Updated: 08 Dec 2025, 05:25 PM IST