ఆంధ్రప్రదేశ్‌లో యోగాంధ్ర 2025 (Yogandhra 2025) కార్యక్రమానికి ప్రభుత్వం చేసిన ఖర్చు పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు (YCP Leaders) విమర్శలు చేయడం పట్ల సీఎం చంద్రబాబు (Chandrababu) ఘాటుగా స్పందించారు. “ఇలాంటి శుభకార్యాల్లో నెగటివ్ మాటలు అనవసరం” అని ఆయన అన్నారు. విశాఖ రుషికొండలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినవాళ్లు ఇప్పుడు ప్రజల నిధులు వృథా అవుతాయంటూ విమర్శించడాన్ని ఆయన దుయ్యబట్టారు. యోగాంధ్ర కోసం కేంద్ర ప్రభుత్వం రూ.75 కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. “భూతాన్ని నియంత్రించడంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తాం” అని వ్యాఖ్యానించారు.
DGCA : విమాన ప్రమాదం ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు
విశాఖపట్నం అభివృద్ధి దిశగా తమ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలు అయిన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలను కలుపుకొని ఒక పెద్ద ఎకనామిక్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దిశానిర్దేశం చేస్తున్నారు. ముంబై కంటే గొప్ప ఎకనామిక్ కారిడార్‌ను ఆవిష్కరించాలని భావిస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు.
Amit Shah : పాక్‌కు వెళ్లాల్సిన నీళ్లను మళ్లిస్తాం..దాయాది గొంతు ఎండాల్సిందే: అమిత్ షా
అదే విధంగా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలకు కూడా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. తిరుపతిని కేంద్రంగా తీసుకుని రాయలసీమ ప్రాంతానికి, అమరావతిని కేంద్రంగా తీసుకుని ఆంధ్ర ప్రాంతానికి ఎకనామిక్ కారిడార్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రాంతీయ సమతుల్యతతోపాటు సమగ్ర అభివృద్ధికి ఇది మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. “పెరుగుతున్న అవకాశాలు, కేంద్రంతో ఉన్న సహకారం వల్ల అభివృద్ధికి మార్గం సుగమం అవుతోంది” అని ఆయన స్పష్టం చేశారు.