ఏలూరు సాక్షి ఆఫీస్ (Sakshi Office) లో అగ్ని ప్రమాదం (Fire Accident ) జరిగిందనే ప్రచారంపై డీఎస్పీ శ్రవణ్ కుమార్ (DSP Sravan Kumar) క్లారిటీ ఇచ్చారు. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “ఈ అగ్నిప్రమాదానికి సాక్షి మీడియా కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇది ఒక ఫర్నిచర్ గోదాం వద్ద మరమ్మత్తుల నిమిత్తం నిలిపిన ఫర్నిచర్‌కు సంబదించించేదే తప్ప సాక్షి ఆఫీస్ కు ఎలాంటి సంబధం ” లేదన్నారు. ఫర్నిచర్ దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
Akhanda 2 Teaser : మెగా, సూపర్ స్టార్ల రికార్డ్స్ ను బ్రేక్ చేసిన బాలయ్య
అగ్ని అదుపులోకి తేవడంలో పోలీస్ సిబ్బంది నిరంతరం కృషి చేస్తుండగానే, దెందులూరు నుంచి వచ్చిన మహిళల నిరసన ర్యాలీ అక్కడకు చేరుకున్నట్టు డీఎస్పీ పేర్కొన్నారు. ఆ సమయంలో జరిగిన ఘటనలన్నీ వీడియోల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయని ,అగ్నిప్రమాదం జరిగిన సమయానికి ర్యాలీ సంఘటన స్థలానికి కనీసం 200 మీటర్ల దూరంలో జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో సాక్షి ఆఫీసు మీద దాడి జరిగిందని , ఆ ఆఫీసులోనే ఫర్నిచర్ కాలిపోయిందని సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న వార్తలు అసత్యమని తేల్చి చెప్పారు.