Site icon HashtagU Telugu

NIA Raids – Telugu States : తెలుగు రాష్ట్రాల్లో 60 చోట్ల ఎన్ఐఏ మెరుపు రైడ్స్ .. ఎందుకు ?

Nia Raids

Nia Raids

NIA Raids – Telugu States : తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న పలువురి ఇళ్లపై ఇవాళ ఉదయం నుంచి జాతీయ దర్యాప్తు  సంస్థ (ఎన్ఐఏ) టీమ్స్ రైడ్స్ చేస్తున్నాయి. హైదరాబాద్, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో దాదాపు 60 చోట్ల ఎన్ఐఏ అధికారులు  ఏకకాలంలో సోదాలు మొదలుపెట్టారు. జూలై 24న మణిపూర్ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతరేకంగా కుల నిర్మూలనా పోరాట సమితి నాయకులు ఆందోళన చేపట్టడమే ఎన్ఐఏ దాడులకు కారణమనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో కేఎన్పీఎస్, పౌర హక్కుల సంఘం, చైతన్య మహిళా సంఘాల రాష్ట్ర నాయకులపై దాడులు కొనసాగిస్తున్నారని సమాచారం.

Also read : World Cup 2023: ప్రపంచ కప్ దగ్గరపడుతోంది, హోటళ్లు యమ కాస్ట్‌లీ గురూ..

హైదరాబాద్‌లోని అమరుల బంధు మిత్రులు సంఘం కార్యకర్త ఇంట్లోనూ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌తోపాటు ఏపీలో మరో ఆరు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న భవాని, అడ్వకేట్ సురేష్ ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. ఆల్వాల్‌లోని సుభాష్ నగర్‌లో వీరి బంధువులు, స్నేహితులు, ఇళ్లపైనా రైడ్స్ చేశారు.  నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విజయవాడ, అనంతపురం, శ్రీకాకుళం, రాజమండ్రి, గుంటూరు జిల్లాలలోనూ పలువురు పౌర హక్కుల కార్యకర్తలు, ఉపాధ్యాయులు, లాయర్ల ఇళ్లపై  రైడ్స్ జరుగుతున్నాయి. వరంగల్‌లోనూ ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. పైడిపల్లి, హంటర్ రోడ్డులోని పలువురు చైతన్య మహిళా మండలి సభ్యుల ఇళ్లలో తనిఖీలు (NIA Raids – Telugu States) సాగుతున్నాయి.