రెడ్ బుక్ (Red Book) ఈ పేరు వింటే చాలు వైసీపీ నేతల్లో వణుకుడు పుడుతుంది. అధికార మదంతో వైసీపీ నేతలు ఐదేళ్ల పాటు ఎన్ని అరాచకాలు..ఎన్ని దౌర్జన్యాలు..ఎన్ని హత్యలు..ఎన్ని అక్రమ కేసులు పెట్టారో తెలియంది కాదు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ను సైతం జైల్లో పెట్టించారు. పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరో , నేతను రోడ్ల మీదకు వచ్చి నిరసన చేసేలా చేసారు. ఇక టీడీపీ, జనసేన శ్రేణులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేదించారో తెలియంది కాదు. సోషల్ మీడియా వేదికగా కూడా ఎన్ని బూతులు అన్నారో..అనిపించారో కూడా తెలియంది కాదు. ఇన్ని చేసిన వీరిని నారా లోకేష్ బదులు తీర్చుకోకుండా ఉంటాడా..? అందరి లెక్క సరిచేసి..ఎలాంటి శిక్షలు వేయాలో..ఏ రేంజ్ లో వేయాలో అన్ని సిద్ధం చేయడమే కాదు..ఆ పని కూడా మొదలుపెట్టాడు. వైసీపీ నేతల పాపాలన్నిటిని రెడ్ బుక్ లో రాసుకొని..ఒక్కొక్కర్ని జైలు కు తరలిస్తున్నారు. ఇప్పటికే పలువురు జైలు ఊచలు లెక్కపెడుతుండగా..తాజాగా పోసాని కృష్ణ మురళి(Posani Krishnamurali)ని సైతం లోపల వేశారు. ఇక నెక్స్ట్ శ్రీరెడ్డి (Srireddy) నే అని తెలుస్తుంది.
Iswarya Menon : స్పైసి లుక్ లో ఐశ్వర్య మీనన్
సినిమాల్లో పెద్దగా గుర్తింపు పొందని శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు, నగ్న ప్రదర్శనల కారణంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేస్తూ ఫిలిం ఛాంబర్ ముందు నిరసన తెలిపినప్పటి నుంచి ఆమె పేరు హాట్ టాపిక్‌గా మారింది. అయితే అప్పట్లో కూడా ఆమెకు సినిమాల్లో అవకాశాలు రాలేదు. కానీ వైసీపీ మద్దతుదారుగా మారిన తర్వాత ఆమె మరింతగా వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, అసభ్యపదజాలంతో దూషించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Saturday: శనివారం రోజు శనీశ్వరుడిని ఎలా పూజించాలి.. అందుకు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా?
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడం తో శ్రీ రెడ్డి సైలెంట్ అయ్యింది. అయినప్పటికీ ఆమెపై అనేక కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇపుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావడం తో నెక్స్ట్ శ్రీ రెడ్డి అరెస్ట్ ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో బహిరంగంగా బూతులతో విరుచుకుపడ్డ వారు ఇప్పుడు కొత్త ప్రభుత్వ పాలనలో కేసులు ఎదుర్కొంటున్నారు. పోసాని మీద కేసు నమోదవ్వడం, ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం వలన శ్రీ రెడ్డి పరిస్థితి కూడా ప్రమాదకరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆమె పవన్ కళ్యాణ్, లోకేష్‌లకు క్షమాపణలు చెబుతూ వీడియోలు విడుదల చేయడం గమనార్హం. అయితే గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలకు, వ్యక్తిగత దూషణలకు కేవలం క్షమాపణలు చెప్పడం ద్వారా తప్పించుకోలేరనే సంకేతాలు అందుతున్నాయి. ఏది ఏమైనప్పటికి అధికార మదంతో నోరు పారేసుకున్న వారంతా ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. అందుకే నోరు అదుపులో పెట్టుకోవాలని అంటారు.