Site icon HashtagU Telugu

New DGP : కొత్త డీజీపీ రేసు.. యూపీఎ‌స్‌సీకి ఐదు పేర్లు.. ప్రయారిటీ ఎవరికి ?

Ap New Dgp Andhra Pradesh Names To Upsc

New DGP : ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ రాబోతున్నారు. నూతన డీజీపీ ఎంపికపై ఏపీలోని కూటమి ప్రభుత్వం సీరియస్ ఫోకస్ పెట్టింది. ఈక్రమంలో ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ)కు పంపింది.  ఈ లిస్టులో మాదిరెడ్డి ప్రతాప్, రాజేంద్ర నాథ్‌రెడ్డి,  హరీశ్ కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యంల పేర్లు ఉన్నాయి. యూపీఎస్‌సీ వీరిలో ముగ్గురి పేర్లను ఎంపిక చేసి, తిరిగి ఏపీ ప్రభుత్వానికి నివేదిక పంపనుంది. ఆ ముగ్గురిలో నుంచి ఒక అధికారిని రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమించే ఛాన్స్ ఉంది.

Also Read :Mahesh Babu : కూతురితో మహేశ్‌బాబు యాడ్‌పై చర్చ.. ఎందుకు ?

హరీష్ కుమార్ గుప్తాకే అవకాశమా ? 

ప్రస్తుతం ఏపీ ఇంఛార్జ్‌ డీజీపీ(New DGP)గా హరీశ్ కుమార్ గుప్తా వ్యవహరిస్తున్నారు. పూర్తిస్థాయి డీజీపీ నియామాకానికి మొగ్గు చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం,  యూపీఎస్సీ ద్వారా డీజీపీని ఎంపిక చేసి రెండేళ్లపాటు కొనసాగించాలని భావిస్తోంది. మెరిట్‌ ప్రకారం హరీశ్ కుమార్‌ గుప్తాకే అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. 2024 మే6న హరీశ్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది.ఈయన  1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2024 మే 5న నాటి ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది.రాజకీయ ఆరోపణల నేపథ్యంలో రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేశారు. ఇప్పుడు యూపీఎస్‌సీకి రాష్ట్ర సర్కారుకు పంపిన లిస్టులో రాజేంద్రనాథ్ రెడ్డి పేరు కూడా ఉండటం గమనార్హం. సీనియార్టీపరంగా హరీశ్ కుమార్ గుప్తా తర్వాతి స్థానాల్లో సీతారామాంజనేయులు, కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఉన్నారు.హరీష్‌ కుమార్ తర్వాత డీజీపీ రేసులో బాలసుబ్రహ్మణ్యం, కుమార్‌ విశ్వజిత్‌‌లు ఉంటారు.

Also Read :Irfan Pathan : ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్‌ నుంచి ఔట్.. ఇర్ఫాన్‌ కీలక ప్రకటన

అప్పటి నుంచి ఖాళీ.. 

గతంలో డీజీపీగా పనిచేసిన ద్వారకా తిరుమల రావు రిటైరయ్యారు. దీంతో అప్పటి నుంచి పూర్తిస్థాయి డీజీపీ పోస్టు ఖాళీగా ఉంది. యూపీఎస్‌సీ‌లో ఎలాగూ కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రభావం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంలో ఏపీలోని కూటమి సర్కారుకు ప్రస్తుతం మంచి ప్రాధాన్యత ఉంది. దాన్ని వినియోగించుకొని తమకు ఇష్టమైన ఐపీఎస్ అధికారిని రాష్ట్ర డీజీపీగా తెచ్చుకునే అవకాశం ఉంది.