Minorities Postcard Movement : చంద్రబాబు కోసం రోడ్డెక్కిన మైనార్టీలు

నెల్లూరు మైనార్టీ నేతలు పోస్ట్ కార్డ్ ఉద్యమం చేపట్టారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్రానికి వారు లేఖలు రాశారు

  • Written By:
  • Publish Date - September 18, 2023 / 04:12 PM IST

స్కిల్ డెవలప్ మెంట్ (Skill Development Case) కేసులో అక్రమంగా మా అధినేత ను , ఓ విజన్ ను అరెస్ట్ చేసారంటూ చంద్రబాబు (Chandrababu) కు మద్దతు తెలుపుతున్న ప్రజలు. కేవలం ఏపీలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ బాబు కు సంఘీభావం (I AM WITH CBN) తెలుపుతూ పెద్ద ఎత్తున రోడ్ల పైకి వస్తూ..తమ నిరసనను తెలియజేస్తున్నారు. మహిళలు సైతం క్యాండిల్ ర్యాలీ చేపడుతూ..చంద్రబాబు కు మద్దతు తెలుపుతున్నారు.

తాజాగా నెల్లూరు మైనార్టీ నేతలు పోస్ట్ కార్డ్ ఉద్యమం (Minorities Postcard Movement) చేపట్టారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్రానికి వారు లేఖలు రాశారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పేరుతో చంద్రబాబుని తప్పుడు కేసులో ఇరికించారని మైనార్టీ నాయకులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మైనార్టీ నేతలతో కలసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.

Read Also : Nara Lokesh : లోకేశ్ అరెస్ట్ కు రంగం సిద్ధం అయిందా?

రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మైనార్టీ నేతలతో కలసి ఆయన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. వారితో కలసి కేంద్రానికి లేఖలు రాశారు. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయి, రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు కడిగిన ముత్యంలా ఈ కేసునుండి చంద్రబాబు బయటపడతారని.. మళ్ళీ ఆయన ప్రజా క్షేత్రంలో తిరిగి వస్తారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన అక్రమ అరెస్టు, ఆయనపై పెట్టిన అక్రమ కేసును ప్రజల్లో విస్తృతంగా చర్చ పెట్టాలన్నారు. అందుకే ప్రతి రోజూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.