Nellore :`ఆనం`కు కోటంరెడ్డి పోటు! అజీజ్ ఔట్‌, TDPలోకి YCP రెబ‌ల్ శ్రీథ‌ర్ రెడ్డి?

నెల్లూరు (Nellore) రూర‌ల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి

  • Written By:
  • Publish Date - January 31, 2023 / 04:06 PM IST

తెలుగుదేశం పార్టీకి వైసీపీ రెబ‌ల్స్ తల‌నొప్పిగా మారింది. నెల్లూరు (Nellore) రూర‌ల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి(Sridhar Reddy) వైసీపీకి గుడ్ బై చెప్ప‌డానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. అంతేకాదు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తాన‌ని లీకైన ఆడియో రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిత్వాన్ని ఆశిస్తోన్న ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డికి ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇటీవ‌ల సోష‌ల్ మీడియా వేదిక‌గా టీడీపీ పార్టీకి అండ‌గా వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి నిలుస్తున్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ఒంటికాలు మీద లేస్తూ `రెడ్డి` సామాజిక‌వ‌ర్గం కార్డ్ ను ప్లే చేస్తూ ఢీ అంటే ఢీ అనేలా మీడియాకు ఎక్కారు. అక్క‌డి టీడీపీ రూర‌ల్ ఇంచార్జి అబ్దుల్ అజీజ్ బ‌దులుగా వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి ఫోక‌స్ అయ్యారు.

కోటం రెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి  వైసీపీకి గుడ్ బై (Nellore)

నియోజక‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న సంద‌ర్భంగా 2009 ఎన్నిక‌ల నాటికి నెల్లూరు(Nellore) రూర‌ల్ అసెంబ్లీ ఏర్ప‌డింది. అప్ప‌టి నుంచి తెలుగుదేశం పార్టీ అక్క‌డ గెలుపు లేదు. పైగా కూట‌మిలో భాగంగా సీపీఎంకు ఆ సీటును 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ వ‌దిలేసింది. ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల్లో పొత్తులో భాగంగా బీజేపీకి త్యాగం చేసింది. ఇక 2019 ఎన్నిక‌ల్లో అబ్దుల్ అజీజ్ ను తొలిసారిగా అభ్య‌ర్థిని టీడీపీ నిలిపింది. కానీ, కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి (Sridhar Reddy) చేతిలో ఓడిపోయారు. ప్ర‌స్తుతం రూర‌ల్  ) నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇంచార్జిగా అజీజ్ కొన‌సాగుతున్నారు. తాజా స‌ర్వేల్లో ఆయ‌న వెనుబ‌డి ఉన్నార‌ని టీడీపీ స‌ర్వేలోని సారాంశం. అందుకే, కొంద‌రు త్యాగాల‌కు సిద్ధం కావాల‌ని ముందుగానే చంద్ర‌బాబు సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్థానాన్ని వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌స్తోన్న కోటంరెడ్డి శ్రీథ‌ర్ రెడ్డికి కేటాయించ‌బోతున్నార‌ని టాక్‌.

Also Read : Nellore Postmortem : చంద్ర‌బాబు స‌భపై పోస్ట్ మార్టం! తొక్కిసలాటపై రాజ‌కీయం!!

నెల్లూరు రూర‌ల్ మాదిరిగా రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంటాయ‌ని తెలుస్తోంది. అందుకే, టీడీపీ ఇంచార్జిలు జ‌న‌సేన‌, వైసీపీ రెబ‌ల్స్ కోసం త్యాగం చేయాల్సి ఉంటుంది. వాస్త‌వంగా శ్రీథ‌ర్ రెడ్డి తొలి నుంచి వైఎస్ ఫ్యామిలీకి చాలా సన్నిహితుడు. స్వ‌ర్గీయ వైఎస్ హయాంలోనే తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యాడు. యూత్ కాంగ్రెస్ లీడ‌ర్ నుంచి వ‌చ్చిన ఆయ‌న ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై సొంత పార్టీ మీద‌నైనా పోరాటం చేస్తాడు. నెల్లూరు ప‌ట్ట‌ణంలో డ్రైనేజి వ్య‌వ‌స్థ బాగాలేద‌ని కొన్ని గంట‌ల పాటు న‌డుముల్లోతు మురికి కాల్వ‌లో దిగి నిర‌స‌న తెలిపాడు. జ‌ర్న‌లిస్ట్ ల మీద జులుం ప్ర‌ద‌ర్శించ‌డంలోనూ ఆయ‌న దిట్ట‌. నెల్లూరు వైసీపీలోని గ్రూప్ ల గురించి రాసిన జ‌ర్న‌లిస్ట్‌ల మీద తిరగ‌బడ్డాడు. రొట్టెల పండ‌గ సంద‌ర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌, శ్రీథ‌ర్ రెడ్డి ఫ్లెక్సీల విష‌యంలో బ‌జారున ప‌డ్డారు.

మాజీ మంత్రి అనిల్‌, శ్రీథ‌ర్ రెడ్డి మ‌ధ్య  ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం

మాజీ మంత్రి అనిల్‌, శ్రీథ‌ర్ రెడ్డి మ‌ధ్య చాలా కాలంగా ప్ర‌చ్ఛ‌న్న‌యుద్ధం జ‌రుగుతోంది. సామాజిక ఈక్వేష‌న్ దృష్ట్యా అనిల్ కు మ‌ద్ధ‌తుగా జ‌గ‌న్ నిలుస్తున్నాడు. దీంతో పార్టీలో చురుగ్గా శ్రీథ‌ర్ రెడ్డి ఉండ‌లేక‌పోతున్నాడు. ఆ క్ర‌మంలోనే అమ‌రావ‌తి రైతుల మ‌హాపాద‌యాత్ర‌కు ఆయ‌న సంఘీభావం తెలిపాడ‌ని నెల్లూరు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జరుగుతోంది. ప్ర‌స్తుత మంత్రి కాకాని గోవ‌ర్థ‌న్ రెడ్డి మీద గుర్రుగా ఉన్నారు. రెండోసారి జ‌రిగిన విస్త‌ర‌ణ‌లో మంత్రివ‌ర్గంలో స్థానం పొందాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ, గోవ‌ర్థ‌న్ రెడ్డికి అవ‌కాశం ల‌భించ‌డంతో క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు కోటం రెడ్డి శ్రీథ‌ర్ రెడ్డి. ఆనాటి నుంచి అసంతృప్తిగా ఉంటోన్న ఆయ‌న్ను తాడేప‌ల్లి కోట‌రీ బుజ్జ‌గించింది. అయిన‌ప్ప‌టికీ నెల్లూరు జిల్లా అధికారులు, పాల‌న మీద అప్పుడ‌ప్పుడు ర‌గిలిపోతున్నారు. తాజాగా ఆయ‌న మీద ఫోన్ ట్రాప్ చేసిన‌ట్టు అనుమానించారు. ఫ‌లితంగా ఇక వైసీపీలో కొన‌సాగ‌లేని ప‌రిస్థితుల్లో టీడీపీ వైపు మ‌ళ్లారు.

Also Read : Nellore TDP : వచ్చే ఎన్నికల్లో బీసీలు టీడీపీకి అండగా నిలవాలి – టీడీపీ నేత చేజ‌ర్ల

వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే టీడీపీలోకి వ‌స్తున్నారంటే, ఖ‌చ్చితంగా టిక్కెట్ ఆఫ‌ర్ ఉండాలి. అదే ఆడియో రూపంలో లీకైయింది. ఇప్పుడు టీడీపీలోని ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, అజీజ్ ఏమి చేస్తారు? అనేది ప్ర‌శ్న‌. అంతేకాదు, జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు ఖాయ‌మైతే, ఆ స్థానం జ‌న‌సేనకు కేటాయించాలి. ఆ మేర‌కు జ‌న‌సేన డిమాండ్ చేస్తోంది. రూర‌ల్ లేదా సిటీ ఏదో ఒక‌టి ఇవ్వాల‌ని కండీష‌న్ పెడుతోంది. నెల్లూరు సిటీ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి టీడీపీ త‌ర‌పున బ‌లంగా ఉన్నారు. ఆయ‌న ఇటీవ‌ల వైసీపీతో ఢీ అంటే ఢీ అనేలా పోరాడుతున్నారు. ఆయ‌న్న కాద‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికీ టిక్కెట్ ఇచ్చే ప‌రిస్థితి లేదు. అంటే, ఒక వేళ పొత్తు జ‌న‌సేన‌తో ఉంటే రూర‌ల్ స్థానం ఆ పార్టీకి కేటాయించాలి. అప్పుడు కోటంరెడ్డి త్యాగం చేయాలి? లేదా జ‌న‌సేన రాజీప‌డాలి? ఈ రెండింటిలో ఏమి జ‌రుగుతుంది? అనేది ఆస‌క్తిక‌రం.