తిరుమల (Tirumala ) పుణ్యక్షేత్రంలో సామాన్యులకు ఏమోగానీ రాజకీయ నేతలకు సినీ ప్రముఖులకు , బిజినెస్ రంగ ప్రముఖులకు సకల మర్యాదలు పలికి దగ్గరుండి అధికారులు స్వామి దర్శనం చేయిస్తుంటారు. ఇది ఈరోజుది కాదు ఎప్పటినుండో వస్తుందే..అయితే తాజాగా తిరుమలలో తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులకు ( Telangana Leaders ) అవమానం జరిగిందనే వార్త వెలుగులోకి వచ్చింది.
టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అధికారులు తమను చిన్నచూపు చూసారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి (MLA Anirudh Reddy) మరియు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat ) ఆరోపించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఇద్దరు నేతలకు అక్కడ వారి నుండి సరైన గౌరవం దక్కలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను సైతం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.
ఏపీకి చెందిన ప్రజా ప్రతినిధుల సమయంలో ప్రొటోకాల్ అమలు అవుతుంటే.. తెలంగాణ నేతలపై ఎందుకు చిన్నచూపు అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు చేస్తే కనీసం గదులు కూడా ఇవ్వడం లేదని అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.చంద్రబాబు రెండు రాష్ట్రాలు “రెండు కళ్ల” లాంటివని చెబుతుంటే, తిరుమలలో తెలంగాణ నేతల పరిస్థితి విరుద్ధంగా ఉందన్నారు. తెలంగాణ ఆలయాల్లో ఏపీ ప్రజాప్రతినిధులకు ప్రొటోకాల్ లేకుండా ఉండాలన్నారు. దీని కోసం వచ్చే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని బల్మూరి వెంకట్, అనిరుధ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also : Bangladesh Protests : దేశాధ్యక్షుడి భవనంలోకి నిరసనకారులు.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత