విజయవాడ సమీపంలోని గన్నవరంలో నేడు NDRF (జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం) రైజింగ్ డే వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Sha) ముఖ్య అతిథిగా హాజరువుతుండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గన్నవరం ప్రాంతంలో ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. భారత్ జట్టులోకి మరో ముగ్గురు ఆటగాళ్లు?
విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం అందించేందుకు గాను ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ ప్రాంగణాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొండపావులూరులో ప్రారంభించనున్నారు. అత్యాధునిక సదుపాయాలతో ఈ ప్రాంగణాలను అభివృద్ధి చేయడం ద్వారా విపత్తుల సమయాల్లో సమర్థవంతమైన సేవలు అందించడంలో వీటికి కీలక భూమిక ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవం అనంతరం హైదరాబాద్ పోలీస్ అకాడమీలో రూ.27 కోట్ల వ్యయంతో నిర్మించనున్న షూటింగ్ రేంజ్‌కు అమిత్ షా శంకుస్థాపన చేయనున్నారు. ఈ రేంజ్ ద్వారా పోలీస్ సిబ్బందికి అత్యాధునిక శిక్షణ సదుపాయాలు అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఇది దేశ వ్యాప్తంగా పోలీస్ శాఖలో శిక్షణా ప్రమాణాలను మెరుగుపరచడంలో తోడ్పడుతుందని భావిస్తున్నారు.
AP BJP : ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. తేల్చబోతున్న అమిత్ షా
ఇక ఎన్‌డీఆర్ఎఫ్ మరియు ఎస్‌డీఆర్ఎఫ్ దళాలు విపత్తుల సమయంలో ప్రతిస్పందనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, వరదలు వంటి పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు వీరి సేవలు ఎనలేనివిగా మారాయి. వీటి ఆధునికీకరణ ద్వారా మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు వీలవుతుంది. ఈ కార్యక్రమాల ద్వారా విపత్తుల సమయంలో ప్రజలలో చైతన్యం కలిగించే ప్రయత్నం చేయడం జరుగుతోంది. సామాన్య ప్రజలంతా కూడా ఎన్‌డీఆర్ఎఫ్ సేవల ప్రాముఖ్యతను తెలుసుకోవడం అవసరం. భవిష్యత్‌లో ఎలాంటి విపత్తులు వచ్చినా అందుకు తగిన శ్రద్ధతో స్పందించేందుకు ఈ సంస్థలు ముందు ఉంటాయని ప్రభుత్వ పెద్దలు పేర్కొన్నారు.