Site icon HashtagU Telugu

Election Campaign : ప్రచారంలో దూసుకెళ్తున్న కూటమి అభ్యర్థులు

Tdp Can

Tdp Can

ఏపీ (AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కూటమి అభ్యర్థులు జోరుగా ప్రచారం (Election Campaign) చేస్తున్నారు. రాష్ట్రంలో సైకో పాలనకు చరమగీతం పాడాలంటూ ప్రతి ఒక్క ఇంటి గడప తొక్కుతూ..ఐదేళ్ల వైసీపీ పాలన లో రాష్ట్రంలో ఎంతగా నష్టపోయిందో వివరిస్తూ..కూటమి అధికారంలోకి వస్తే జరిగే మంచిని వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఉదయం లేచినదగ్గరి నుండి మొదలు పడుకునేవరకు మూడు పార్టీలు టిడిపి , జనసేన , బిజెపి నేతలు ప్రచారంలో తమ జోరు చూపిస్తూ..అధికార పార్టీ(YCP)కి చెమటలు పట్టిస్తున్నారు. వైసీపీ అంటే పబ్లిసిటీకి మాత్రమే కాదు టిడిపి (TDP) అంటే ప్రజల బాగోగులు చూసే పార్టీ అని ప్రజలకు తెలియజేసేలా ప్రచారం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో మూడు పార్టీల నేతలు కలిసికట్టుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటు టిడిపి అధినేత చంద్రబాబు సైతం మండుఎండను సైతం లెక్కచేయకుండా ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. మంత్రి జోగి రమేష్‌, పెడన నియోజకవర్గం మొత్తాన్ని దోచుకుని, ఇప్పుడు పెనమలూరుకి వచ్చారంటూ చంద్రబాబు మండిపడ్డారు. రోగి లాంటి జోగికి, బోడే ప్రసాద్ మెడిసిన్‌ అని తెలిపారు. అన్యాయానికి ప్రజాచైతన్యమే విరుగుడని చంద్రబాబు తెలిపారు. అంతా కలిసి, కూటమి గెలుపించాలని కోరారు. ఐదేళ్లలో 20 లక్షల కొలువులు అందిస్తానని.. మీ ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు కావాలా? గంజాయి కావాలా? అనేది తల్లిదండ్రులు ఆలోచించుకోవాలని పేర్కొన్నారు. పిల్లలకు ఉద్యోగాల్లేక, మీరు కూలి చేసి వారికి డబ్బులు ఇవ్వాల్సిన దుస్థితికి జగన్‌ తీసుకొచ్చారని చంద్రబాబు అని ధ్వజమెత్తారు.

Read Also : Amritpal Singh : నా కొడుకును పంజాబ్‌ జైలుకు తరలించండి..​అమృత్​పాల్ సింగ్ తల్లి అరెస్టు