Natti Kumar : సీఎం జగన్ పెయిడ్ ఆర్టిస్ట్‌ల మీద ఆధారపడి బతుకుతున్నాడు – నట్టికుమార్

ప్రముఖ నిర్మాత నట్టికుమార్ (Natti Kumar) మరోసారి జగన్ (CM Jagan) ఫై కీలక ఆరోపణలు చేసారు. సీఎం జగన్ పెయిడ్ ఆర్టిస్ట్‌ల మీద ఆధారపడి బతుకుతున్నాడని, తన ఓటమిని ఒప్పుకున్నట్లు మాట్లాడుతున్నారని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. నిన్న తిరుపతి లో జగన్ మాట్లాడిన మాటలపై నట్టికుమార్ స్పందించారు. We’re now on WhatsApp. Click to Join. జగన్ లో ఓటమి భయం మొదలైందని..అందుకే తన ఓటమిని ముందే ఒప్పేసుకుంటున్నాడని, తన చెల్లెలు షర్మిలను కూడా […]

Published By: HashtagU Telugu Desk
Nattikumar

Nattikumar

ప్రముఖ నిర్మాత నట్టికుమార్ (Natti Kumar) మరోసారి జగన్ (CM Jagan) ఫై కీలక ఆరోపణలు చేసారు. సీఎం జగన్ పెయిడ్ ఆర్టిస్ట్‌ల మీద ఆధారపడి బతుకుతున్నాడని, తన ఓటమిని ఒప్పుకున్నట్లు మాట్లాడుతున్నారని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. నిన్న తిరుపతి లో జగన్ మాట్లాడిన మాటలపై నట్టికుమార్ స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

జగన్ లో ఓటమి భయం మొదలైందని..అందుకే తన ఓటమిని ముందే ఒప్పేసుకుంటున్నాడని, తన చెల్లెలు షర్మిలను కూడా ఎవరెవరితోనో తిట్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్.. తన తల్లి, చెల్లికి ఇచ్చే గౌరవం‌ ఎంటో కనబడుతోందన్నారు. వైసీపీ గెలుపుపై నమ్మకంలేకే ఎమ్మెల్యేలు, సీట్లను మారుస్తున్నారని , రాబోయే ఎన్నికల్లో వైసీపీకిడిపాజిట్లు కూడా రావని నట్టికుమార్ విమర్శించారు. చంద్రబాబు, పవన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఒక పక్కన ప్రజలు బాధపడుతుంటే.. మరొవైపు సీఎం జగన్ నవ్వుకుంటూ తిరుగుతున్నాడని దెప్పిపొడిశారు.

ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని స్పష్టంగా కనపడుతుందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేరు.. కానీ కొండపై 500 కోట్లు పెట్టి బిల్డింగ్ లు మాత్రం కట్టించుకుంటారని మండిపడ్డారు. విశాఖ రామానాయుడు స్టూడియోను.. తన కార్యాలయంగా మార్చుకుంటానని చెబితే కోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. కరెంట్ లేకుండానే భారీగా బిల్లులు వస్తున్నాయని , ప్రతి డిపార్ట్మెంట్‌లో అవినీతి కొండలా పెరిగిపోయిందని నట్టికుమార్ ఆరోపించారు. ఏపీ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ గెలిపించాలని పిలుపునిచ్చారు. అంబటి సంబరాల డాన్సులకు తప్ప పోలవరానికి పనికిరాడని.. రోజా టూరిజాన్ని ఏం డెవలప్ చేసిందని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసి ముందడుగు వేయాలని కోరారు.

Read Also : Nara Lokesh Clarity On Red Book : రెడ్ బుక్ లో ఏముందో తెలిపిన నారా లోకేష్

  Last Updated: 25 Jan 2024, 08:29 PM IST