Andhra Pradesh: ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు మాజీ మంత్రి, నెల్లూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ. సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని ప్రజలను కోరారు. బాబు హామీ – భవిష్యత్తు హామీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని 16వ డివిజన్‌లో పర్యటించిన నారాయణను డివిజన్ నాయకులు, కార్యకర్తలు, నిర్వాసితులు సన్మానించారు.
నారాయణ తన పర్యటనలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ తాళ్లపాక అనురాధతో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించి రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి కూటమికి మద్దతు ఇవ్వాలని నారాయణ కోరారు. బలమైన కూటమి ద్వారానే దేశం, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఉద్ఘాటించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సైకిల్ గుర్తుకు, ఉమ్మడి కూటమికి మద్దతివ్వాలని నారాయణ విజ్ఞప్తి చేయడంతో పాటు ఈ ప్రాంత అభ్యున్నతి కోసం పార్టీల మధ్య ఐక్యత ఎంత అవసరమో తెలియజేసారు.
Also Read: Election Code : ఎన్నికల వేళ..మిర్యాలగూడలో రూ.5.73 కోట్ల బంగారం పట్టివేత