Site icon HashtagU Telugu

Nara Lokesh Yuvagalam : అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించిన లోకేష్

Nara Lokesh Yuvagalam Padayatra to End at Aganampudi

Nara Lokesh Yuvagalam Padayatra to End at Aganampudi

యువగళం పాదయాత్ర ముగిసిన సందర్బంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదల చెంతన ప్రారంభమైన యాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా కొనసాగింది. 70 బహిరంగసభల్లో లోకేశ్ ప్రసంగించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పాదయాత్రకు 79 రోజుల పాటు తాత్కాలిక విరామం ఇచ్చి..తిరిగి ప్రారంభించారు.

ఈరోజు విశాఖలోని శివాజీనగర్ లో యాత్ర పూర్తి అయ్యింది. ఈ సందర్భాంగా అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించిన లోకేశ్ తన సుదీర్ఘ పాదయాత్రకు ముగింపు పలికారు. చంద్రబాబు పాదయాత్ర ముగించిన చోటే యువగళం పాదయాత్ర కూడా ముగించనుండడం మరో విశేషం. ఇక డిసెంబర్‌ 20న భోగాపురంలో ముగింపు సభను ఏర్పాటు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

పైలాన్ ఆవిష్కరించిన అనంతరం లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళం అని స్పష్టం చేశారు. అణచివేతకు గురైన వర్గాలకు యువగళం గొంతుక అయిందని అన్నారు. యువగళం ప్రజాగళమై నిర్విరామంగా సాగిందని లోకేశ్ పేర్కొన్నారు. ఒక అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యం దాడి చేశాడని విమర్శించారు. యువగళం పాదయాత్రలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.

Read Also : Buddha Venkanna : కొడాలి నాని నీకు బడితపూజ తప్పదు – బుద్ధా వెంకన్న