ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీడీపీ (TDP) అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ (Nara Lokesh), టీడీపీ నేతలు నిత్యం ప్రజల్లో ఉంటూ వైసీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేఖ విధానాలను కొనసాగిస్తుందంటూ ప్రజలకు వివరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకివస్తే ఏఏ పథకాలు అమలు చేస్తుందో ప్రజలకు వివరిస్తున్నారు. దీనికితోడు నారా లోకేష్ చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.
యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతుండటంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. యువగళం పాదయాత్ర ముందు వరకు లోకేష్‌ను పప్పు అంటూ కామెంట్స్ చేస్తూ వచ్చిన వైసీపీ శ్రేణులుసైతం యువగళం పాదయాత్రలో లోకేష్ జోరును చూసి ఆశ్చర్యపోతున్న పరిస్థితి. యువగళం పాదయాత్రలో అన్నివర్గాల ప్రజలతో భేటీ అవుతున్న లోకేశ్ టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో స్పష్టంగా వివరిస్తున్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నట్లు చర్చ జరుగుతుంది.
జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన సమయంలోనూ, పలు సందర్భాల్లో అధికారంలోకి వచ్చేది మేమే.. మీ అంతు చూస్తాం అంటూ తనకు అడ్డు తగిలిన అధికారులను హెచ్చరించారు. దీంతో, కొన్ని సందర్భాల్లో అధికారులుసైతం జగన్ జోలికి వెళ్లేందుకు వెనుకడుగు వేశారు. అదే విధానాన్ని ప్రస్తుతం లోకేష్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. పాదయాత్ర సమయంలో తనకు అడ్డు తగిలిన పోలీసు అధికారులకు, వైసీపీ నేతలకు లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చేది టీడీపీనే. నేను ఎవ్వరినీ వదిలిపెట్టను. నాకు అడ్డువచ్చిన అందరి పేర్లను నా ఎర్రబుక్లో రాసుకుంటున్నా. అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి లెక్కసరిచేస్తా అంటూ లోకేష్ వార్నింగ్ ఇస్తున్నారు.
Pawan Kalyan : నాకు అధికారం ఇవ్వండి.. సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. గుండా కొడుకులకు నరకం చూపిస్తా