Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపు ఉదయం ఢిల్లీ నుంచి విజయవాడకు తిరిగి రానున్నారు. బుధవారం విజయవాడకు వచ్చిన వెంటనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు ఆయన హాజరు కానున్నారు. ఈ కేసులో నారా లోకేశ్ ను A14 గా చేర్చిన ఏపీ సీఐడీ.. చంద్రబాబును ఏ-01గా, మాజీ మంత్రి నారాయణను ఏ2 గా చేర్చింది. సీఐడీ నుంచి నోటీసులు జారీ అయినందున.. రేపు జరిగే సీఐడీ విచారణకు మాజీ మంత్రి నారాయణ కూడా హాజరుకానున్నారు. ఇద్దరినీ కలిపి, విడివిడిగానూ సీఐడీ విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘నోటీసులు తీసుకున్నాక.. నేను తప్పకుండా హాజరవుతాను. తప్పు చేయనప్పుడు దాక్కోవాల్సిన అవసరం లేదు’’ అని ఇటీవల లోకేష్ స్పష్టం చేశారు. చెప్పిన విధంగానే ఆయన సీఐడీ విచారణను ఎదుర్కొనేందుకు సమాయత్తం అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join
దాదాపు గత పదిరోజులుగా ఢిల్లీలో ఉన్న లోకేశ్ రాష్ట్రపతి, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, ప్రముఖ మీడియా ప్రతినిధులను కలిశారు. రాజకీయ కుట్రతో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన అంశాన్ని వారికి వివరించారు. తాజాగా అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నివాసంలో లోకేశ్ ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేశారు. పార్లమెంట్ గాంధీ విగ్రహం, రాజ్ ఘాట్ వద్ద టీడీపీ ఎంపీలు నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈక్రమంలోనే ఢిల్లీకి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయనకు 41ఏ కింద నోటీసులను (Nara Lokesh) అందజేశారు.
Also read : Pakistan Inflation: పాకిస్తాన్ లో దిగజారుతున్న పరిస్థితులు.. రూ. 3000 దాటిన గ్యాస్ సిలిండర్ ధర..!