తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రస్తుతం ఢిల్లీ(Delhi Tour)లో రాజకీయంగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ కావడానికి మంగళవారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ముఖ్యంగా కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలసి, ఏఐ ఎక్సలెన్స్ సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే, ఇతర అభివృద్ధి సంబంధిత అంశాలపై కూడా చర్చలు జరిగాయి.
ChatGPT- DeepSeek : చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌కు దూరంగా ఉండండి: కేంద్రం ఆదేశాలు..!
బుధవారం కూడా లోకేష్ ఢిల్లీలోనే ఉండి మరికొందరు కేంద్ర మంత్రులను కలుస్తూ వస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వ మద్దతు తీసుకొచ్చేందుకు ఆయన ప్రత్యేకంగా శ్రమిస్తున్నారు. అభివృద్ధి పనులకు మరింత ఊతమిచ్చేలా కేంద్రంతో సహకారం పొందే లక్ష్యంతో లోకేష్ తన పర్యటనను కొనసాగిస్తున్నారు. గూగుల్ క్లౌడ్ MD బిక్రమ్ సింగ్, డైరెక్టర్ ఆశిష్తో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేసే డేటా సిటీపై వారితో చర్చించారు. త్వరితగతిన అనుమతులు, భూకేటాయింపులు చేస్తామని లోకేశ్ వారితో చెప్పారు. ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని, కంపెనీ కూడా ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు APకి గేమ్ ఛేంజర్ నిలుస్తుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
ఇక లోకేష్ ఢిల్లీ పర్యటనకు మరో రాజకీయ కోణం కూడా ఉందని తెలుస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై కేంద్ర స్థాయిలో చర్యలు తీసుకునేలా పకడ్బందీగా అడుగులు వేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో లోకేష్ మౌనంగా ఉన్నప్పటికీ, ఆయన ప్రత్యేకమైన ఎజెండాతో ఢిల్లీకి వెళ్లినట్లు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఏపీ అభివృద్ధికి సంబంధించి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో నారా లోకేష్ ఢిల్లీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ భేటీలు, చర్చలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.