Site icon HashtagU Telugu

Pawan Kalyan – Lokesh : థాంక్యూ అన్నా అంటూ పవన్ కు లోకేష్ ట్వీట్

Lokesh Says Thanks To Pawan Kalyan

Lokesh Says Thanks To Pawan Kalyan

Nara Lokesh Thanks to Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) థాంక్యూ చెపుతూ ట్వీట్ చేసారు. విశ్వ విద్యాలయాలను ప్రక్షాళన చేయాలని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) ట్విట్టర్ వేదిక గా హర్షం వ్యక్తం చేశారు.

విద్యా సంస్థాగత సాధికారత దిశగా గొప్ప చొరవ తీసుకున్నందుకు నారా లోకేష్‌కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు లోకేష్ థాంక్యూ చెపుతూ ట్వీట్ చేసారు. థాంక్యూ పవన్ అన్నా అంటూ రిప్లై ఇచ్చారు.

ఇదిలా ఉంటె తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఫ్యామిలీ నాగిని డ్యాన్స్ చేసారంటూ వైసీపీ ప్రచారం చేయడం ఫై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తిరుమల శ్రీవారితో పెట్టుకోవద్దంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను హెచ్చరించారు. విజయవాడలో మంత్రి ఇంట్లో జరిగిన వీడియోను తిరుమలలో జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నారా లోకేష్ మండిపడ్డారు.

“ఫేక్ జగన్ నువ్వు మారవు.. నీ ఫేక్ మూకలు అస్సలు మారరు. ఫేక్ చేసి చేసీ 151 నుంచి 11కి వచ్చావు.. మంత్రి సంధ్యారాణి విజయవాడ ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలు తిరుమలలో జరిపినట్టు ఫేక్ ప్రచారం చేస్తున్నావు.. శ్రీవారితో పెట్టుకోవద్దు.. ఏడుకొండలపై నీ విష రాజకీయాలు వాడొద్దు. ఒక్క సీటు కూడా లేకుండా పోతావ్..” అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Read Also : Hyderabad: ఓల్డ్ సిటీ హిందువులదే: కేంద్ర మంత్రి బండి