Site icon HashtagU Telugu

NTR- Lokesh : జూ. ఎన్టీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి నారా లోకేష్

Lokesh Ntr

Lokesh Ntr

తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన విపత్తుకు చిత్రసీమ కదిలివస్తుంది. వరదబాధితుల కోసం బాధితులకు సాయం చేసేందుకు మేమున్నాం అంటూ ప్రతి ఒక్కరు సాయం ప్రకటిస్తూ వస్తున్నారు. ముందుగా జూ. ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షలు ప్రకటించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు తెలియజేశారు. విరాళం అందించిన మరో హీరో విష్వక్సేన్ కు కూడా రేవంత్, లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna ) రెండు రాష్ట్రాలకు కోటి రూపాయిల సాయాన్ని (Donates Rs 1 crore) ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటి వరకు సహాయం ప్రకటించిన సెలబ్రిటీలు వీరే..

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ (Vijayanthi Movies) ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ‘ఆయ్‌’ చిత్రానికి సోమవారం నుంచి వారాంతం వరకూ వచ్చే కలెక్షన్లలో 25 శాతం ఆదాయాన్ని జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు విరాళంగా అందజేస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు.

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ (Vishwak Sen) సైతం తెలుగు రాష్ట్రాల‌ వ‌ర‌ద‌ల‌పై స్పందిస్తూ త‌మ సానుభూతి తెలియ‌జేశారు. ‘భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వ‌ర‌ద బీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.’ అంటూ త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ ఏపీ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.5 లక్షల చొప్పున‌ విరాళం అందజేశారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, ఎస్‌. రాధాకృష్ణ‌, ఎస్ నాగ‌వంశీలు సంయుక్తంగా త‌మ హారిక‌, హ‌సిని క్రియేష‌న్స్‌, సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ త‌రుపున ఆంద్ర‌ప్రదేశ్ రాష్ట్రానికి రూ.25 ల‌క్ష‌లు, తెలంగాణ‌లకు రూ.25 ల‌క్ష‌ల చొప్పున మొత్తంగా రూ.50 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించారు. జూ. ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయిలు ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ- ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు, డైరెక్టర్ వెంకీ అట్లూరి- ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు ప్రకటించారు. వీరి బాటలోనే మిగతా హీరోలు , నిర్మాతలు కూడా తమ వంతు సాయం అందజేసేందుకు ముందుకు వస్తున్నారు.

Read Also : Instant Dosa : మినపపిండి లేకుండా.. నిమిషాల్లో ఇన్ స్టంట్ దోసెలు.. ఇలా చేస్కోండి