Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. వైసీపీ అధినేత జగన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలను పంచడమే కాకుండా, రాష్ట్ర ప్రజల మధ్య విభేదాలు రేపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. “అమరావతిపైనా, ఆంధ్రప్రదేశ్‌పైనా కక్ష ఇంకా తీరలేదా?” అంటూ లోకేశ్ ప్రశ్నించారు. తమిళనాడులో జరిగిన ఒక ఘటన వీడియోను తీసుకుని, దానిని అమరావతిలో జరిగిందని చూపిస్తూ వైసీపీ ఫేక్ ప్రచారం చేయించిందని మండిపడ్డారు. “ఇది ఎంత దారుణమో ప్రజలందరూ గమనిస్తున్నారు. అమరావతి అందరిదీ, ఇది ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు. ఇక్కడ ఎలాంటి వివక్ష ఉండదు. ఇది బౌద్ధం పరిపుష్టి పొందిన నేల. కుల, మత, ప్రాంతాలకతీతంగా ఇక్కడ ప్రజలు ఎప్పటినుంచో ఆత్మీయ బంధంతో కలిసిమెలిసి జీవిస్తున్నారు” అని లోకేశ్ అన్నారు.
Kamareddy : NH-44పై 20 కి.మీ ట్రాఫిక్ జామ్..తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
అమరావతిని కించపరుస్తూ, ప్రజల్లో అనుమానాలు రేపే ప్రయత్నం జగన్ రెడ్డి చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. “ప్రాంతాల మధ్య విద్వేషాలు, కులాల మధ్య కలహాలు, మతాల మధ్య మంటలు రేపి రాజకీయంగా లాభం పొందాలన్న జగన్ రెడ్డి కుతంత్రాలకు కాలం చెల్లింది. కులాల మధ్య ఘర్షణలు రేపేందుకు కుట్రలు పన్నిన కిరాయి మూకల ఆటలన్నీ చివరికి చట్టం కట్టిస్తాయి. దీని వెనకుండి నడిపిస్తున్న జగన్ రెడ్డి కూడా చట్టం ముందు దోషిగా నిలవక తప్పదు” అని లోకేశ్ హెచ్చరించారు. అమరావతిపై వైసీపీ చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం, వాస్తవాలను వక్రీకరించి ప్రజల మదిలో అపోహలు నింపే ప్రయత్నం మాత్రమేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Controversy : స్టేజ్ పై నటి నడుమును తాకి వివాదంలో చిక్కిన పవన్