Nara Lokesh : తనిఖీల పేరుతో పదే పదే వాహనం ఆపడం ఫై లోకేష్ ఆగ్రహం

ఒకే రోజు రోజు సార్లు వాహనాన్ని అపి చెక్ చేయడం ఫై అధికారుల ఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు

  • Written By:
  • Publish Date - March 24, 2024 / 10:00 PM IST

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ (Election Code) నడుస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు (Police) తనికీలు చేపడుతున్నారు. ప్రతి వాహనాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే రాజకీయ నేతల వాహనాలను సైతం తనిఖీలు చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీల నేతలను పదే పదే ఆపుతూ తనిఖీలు చేయడం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే రోజు రోజు సార్లు వాహనాన్ని అపి చెక్ చేయడం ఫై అధికారుల ఫై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మండిపడ్డారు. ప్రధానంగా డీజీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీజీపీకి టైమ్ దగ్గర పడింది’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాల వాహనాలు మాత్రమే తనిఖీ చేయమని డీజీపీ(AP DGP) ఆదేశాలు ఇచ్చినట్లు కిందిస్థాయి సిబ్బంది చెబుతున్నారన్నారు.

డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీని సస్పెండ్ చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. అధికార పార్టీ తొత్తుల్లా వ్యవహరిస్తున్న డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీపై చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని అన్నారు. అలాగే గుంటూరు ఎస్పీ కూడా టీడీపీ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. సకల శాఖల సజ్జల, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీల వాహనాలు పోలీసులకు కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. మంగళగిరి మొత్తం డ్రగ్స్ డెన్‌గా మారింది… పోలీసులకు ఇదేమీ కనిపించదా? అధికార పార్టీ నేతల ప్రమేయం, పోలీసుల సహకారం లేకుండా సీఎం ఇంటి చుట్టూ విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు ఎలా దొరుకుతాయి..? అని లోకేష్ ప్రశ్నించారు.

గత మూడు రోజుల్లో నాలుగుసార్లు నారా లోకేష్ కాన్వాయ్‌ను ఆపి తనిఖీ చేయడం పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్ ను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. మార్చి 20 న ఉదయం 8 గంటలకు, 23న ఉదయం 8 గంటలకు, ఈరోజు ఉండవల్లి కరకట్ట వద్ద ఉదయం 8.10 కి, సాయంత్రం 5 గంటలకు లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీలు చేశారని తెలిపారు. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని చెబుతున్నారని, కేవలం లోకేష్ వాహనాలను మాత్రమే ఆపాలని పోలీసులకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అని నిలదీశారు. వైసీపీ ముఖ్య నాయకుల కాన్వయ్‌లు ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు.

Read Also : Janasena : జనసేన 18 నియోజకవర్గ అభ్యర్థులు వీరే..