Site icon HashtagU Telugu

AP : జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్ అంటూ నారా లోకేష్ సైటైర్లు

Naralokesh Amala

Naralokesh Amala

ఏపీ (AP)లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు (AP 2024 Elections) జరగబోతున్నాయి. దీంతో అందరి దృష్టి ఏపీ ఎన్నికలపైనే ఉంది. ఈసారి ఏ పార్టీ అధికారం చేపడుతుందో అని లెక్కలేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ..ఈసారి 175 కు 175 కొట్టాలని చూస్తుంటే..మరోపక్క టీడీపీ – జనసేన కూటమి ఈసారి విజయం మాదే అంటుంది..ఇక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల సైతం ఈసారి మాదే విజయం అంటుంది. ఇలా ఎవరికీ వారు తమ విజయాలపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉండగానే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ట్విట్టర్ వేదికగా వైసీపీ ఫై సెటైర్లు వేశారు. 56 నెలలుగా బాగా పరిపాలన చేశానని, ఇప్పటికిప్పుడు దిగిపోవాల్సి వచ్చినా విచారం లేదని ఇండియా టుడే సమ్మిట్లో సీఎం జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై లోకేష్ సెటైర్లు వేశారు. జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్ అని రాసుకొచ్చారు. మరో ట్వీట్ లో అమరావతి రైతులు చేస్తోన్న ఉద్యమం 1500 రోజులకు చేరుకోవడంపై స్పందించారు. ‘కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులకు ఎదురొడ్డి నిలబడింది అమరావతి. ప్రజా రాజధాని కోసం 1500 రోజులుగా నియంతపై పోరాడుతున్న రైతులకు ఉద్యమాభివందనాలు. అమరావతి కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు. వారి ఆశయం త్వరలోనే నెరవేరుతుంది. రైతులకు న్యాయం జరుగుతుంది. అధర్మంపై ధర్మం విజయం సాధిస్తుంది’ అని పేర్కొన్నారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కి 63 సీట్లు కేటాయించాలని చంద్రబాబు డిసైడ్ చేసినట్లు సమాచారం అందుతుంది. టీడీపీ 112 స్థానాల్లో బరిలోకి దిగనుండగా, పొత్తులో ఉన్న జనసేన 63 స్థానాల్లో పోటీ చేయాలని ఇరు పార్టీల అధిష్టానాలు నిర్ణయం తీసుకున్నాయని ఓ ప్రకటన వెలువడింది. కానీ దీనిపై టీడీపీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Read Also : National Tourism Day 2024 : మనదేశంలో బెస్ట్ చూడదగ్గ ప్రదేశాలు ఇవే