Nara Lokesh : రెడ్‌బుక్ పేరు వినగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల గుండెల్లో దడ మొదలవుతోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన ఆయనకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, వర్ల కుమార్ రాజా, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్‌లు లోకేశ్‌తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా “తల్లికి వందనం” పథకంపై లోకేశ్ మాట్లాడారు. పిల్లల చదువుల కోసం ఏ తల్లీ ఆర్థికంగా ఇబ్బంది పడకూడదన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం మహిళల్లో విశ్వాసాన్ని కలిగించిందని, వారు చూపిన స్పందన ఆశాజనకంగా ఉందన్నారు. మహిళల గౌరవం విషయంలో గత వైసీపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శించిన లోకేశ్, “అప్పుడు మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారిని గౌరవిస్తోంది,” అని వ్యాఖ్యానించారు.
Shubhanshu Shukla : శుభాంశు శుక్లా రోదసి యాత్ర ప్రారంభం..నింగిలోకి ఫాల్కన్ -9 రాకెట్
సమాజంలో అసలు మార్పు రావాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా మహిళల పట్ల ప్రవర్తనలో మానసికంగా మార్పు రావాలని లోకేశ్ సూచించారు. ఇది కేవలం చట్టాలు చేయడం వల్ల కానీ, డబ్బులు పంచడం వల్ల కానీ సాధ్యపడదన్నారు. అందువల్లే పాఠశాలల స్థాయిలోనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధాలను బలోపేతం చేసేలా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
తన విజయాల వెనుక తన భార్య బ్రాహ్మణి సహకారం అమూల్యమని గుర్తుచేశారు. అలాగే తన తల్లి నారా భువనేశ్వరి త్యాగం వల్లే తండ్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సేవ చేసే అవకాశం పొందారని అన్నారు. మహిళల గౌరవాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని రంగాల్లో చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.
Local Body Elections : సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు