Site icon HashtagU Telugu

Chandrababu Mulakat : జైల్లో చంద్రబాబును ఆలా చూసి తట్టుకోలేకపోయిన కుటుంబ సభ్యులు

Lokesh Babu

Lokesh Babu

స్కిల్ డెవలప్ మెంట్ కేసు (Skill Development Case)లో మాజీ సీఎం , టీడీపీ అధినేత ను రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో వేసిన సంగతి తెలిసిందే. దాదాపు 50 రోజులు కావొస్తున్నా ఈయనకు బెయిల్ రాలేదు..కనీసం ఈయన ఈ నేరం చేసారని ఆధారాలు కూడా చూపించలేకపోయారు. అయినప్పటికీ బెయిల్ కూడా ఇవ్వకుండా కక్షపూరితంగా బాబు ను జైల్లో ఉంచి మానసికంగా హింసిస్తున్నారు. రెండు రోజుల క్రితం తనకు జైల్లో ప్రాణ హాని ఉందని , కొంతమంది పెన్ డ్రైవ్ లతో తిరుగుతున్నారని, డ్రోన్ కెమెరాలతో వీడియోస్ తీస్తున్నారని , జైల్లో ఎక్కువ సంఖ్యలో గంజాయి ఖైదీలు ఉన్నారని..తన ప్రాణాలు తీసేందుకు కోట్లాది రూపాయిలు చేతులు మారాయని..ఇలా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు(Chandrababu Letter) ఏసీబీ కోర్ట్ జడ్జ్ కి లేఖ రాసారు. ఈ లేఖ తర్వాత కుటుంబ సభ్యుల్లో , టీడీపీ శ్రేణుల్లో మరింత ఆందోళన పెరిగింది.

నేడు చంద్రబాబు తో కుటుంబ సభ్యులు ములాఖత్ (Nara Lokesh – Chandrababu Mulakat) అయ్యారు. జైల్లో బాబు ను ఆలా చూసి కన్నీరు పెట్టుకున్నారు. ములాఖత్ అనంతరం బాబు ఆరోగ్యం, బరువు, భద్రతకు సంబంధించి అనేక విషయాలు నారా లోకేష్ (Nara Lokesh) మీడియా తో మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో దమ్ముంటే సీఐడీ (CID), ప్రభుత్వం (YCP Govt) ఆధారాలు చూపాలి. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో ఉంచారు. బెయిల్‌పై జగన్ పదేళ్లు ఎలా బయట వున్నారు..?. బాబాయిని చంపిన ఎంపీ అవినాష్ రెడ్డి కూడా రోడ్డుపై తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబును 50 రోజులుగా జైల్లో పెట్టారు. 50 రోజులుగా స్కీల్ కేసులో ఏ చిన్న ఆధారం కూడా ప్రభుత్వం చూపించలేకపోయింది. చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసి 50 రోజులుగా జైల్లోనే ఉంచారు. ఏపీలో వ్యక్తిగత కక్ష సాధింపులు చూస్తున్నాం. చంద్రబాబు చనిపోవాలి.. చంద్రబాబును చంపేస్తామని వైసీపీ నేతలు బాహాటంగా చెబుతున్నారు. కేసుతో ఎలాంటి సంబంధం లేని నా తల్లి భువనేశ్వరిని కూడా జైలుకు పంపిస్తామని వైసీపీకి చెందిన మహిళా మంత్రి మాట్లాడుతున్నారు. నిజం గెలవాలి అని బస్సుయాత్రతో ప్రజల్లోకి నా తల్లి వెళ్తే ఆమెను కూడా అరెస్టు చేస్తామంటారా?. ఇది ఎంతవరకు సమంజసం అని లోకేష్ ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

సజ్జల జైళ్లు శాఖ డీఐజీతో ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నారు. సీఐడీ పోలీసులు కాల్ డేటా ఎందుకు ఇవ్వరు..?. చంద్రబాబు బరువు తగ్గారు. 72 నుంచి 66 కిలోలకు బరువు తగ్గారు. నాకు చాలా బాధగా ఉంది. కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లపై ముఖుల్ రోహిత్గీతో వాయిదాలు వేయిస్తున్నారు. మేం రెడీగా ఉంటే వాయిదాలు అడుగుతున్నారు అని లోకేష్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదు. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా జైల్లో ఉంచి ఏం సాధించారు?. వైసీపీ అరాచకాలను వదిలేది లేదు. మళ్లీ సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే ఎక్కడ అవినీతి జరిగిందో చూపించండి అంటూ వైసీపీ సర్కార్ కు సవాల్ విసిరారు.

Read Also : YCP Bus Yatra Flop : తుస్సుమన్న వైసీపీ సామాజిక సాధికార బ‌స్సు యాత్ర..