రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనవరి 4వ తేదీ నుంచి జయహో బీసీ పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. జయహో బీసీ కార్యక్రమ నిర్వహణపై తొలుత చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఒక వర్క్ షాపు ఏర్పాటు చేసుకుంటామని.. జనవరి 4వ తేదీనుంచి పార్లమెంటు, అసెంబ్లీ మండలస్థాయిల్లో సమావేశాలు నిర్వహిస్తామని లోకేష్ తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో ఒక భారీ సభ ఏర్పాటుచేసి బీసీ సోదరులకు మ్యానిఫెస్టో విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు. యువగళం పాదయాత్రలో బీసీ సోదరులు పడుతున్న ఇబ్బందులు తాను తెలుసుకున్నానని.. తాను తిరగని మండలాల్లో కూడా జయహో బీసీ ద్వారా సమస్యలు తెలుసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బీసీ సోదరులకు పుట్టినిల్లు టీడీపీ అని.. రాజకీయంగా ఆనాడు అన్న ఎన్టీఆర్ 1982లో బీసీ సోదరులకు సీట్లు ఇచ్చి గెలిపించి కీలకశాఖలు ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. బీసీ అంటే బలహీనవర్గం కాదు, బలమైన వర్గమని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్టీఆర్ 24శాతం రిజర్వేషన్ కల్పిస్తే, చంద్రబాబునాయుడు 34శాతానికి పెంచారన్నారు. గత ప్రభుత్వంలో బీసీల కోసం రూ.36వేల కోట్ల ఖర్చుచేశామని.. బీసీ కార్పొరేషన్ ద్వారా 3వేల కోట్లు, ఆదరణ ద్వారా వెయ్యికోట్లు వెచ్చించామని తెలిపారు. బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్, విదేశీవిద్య, ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి ఎన్నో పథకాలు అమలుచేశామని.. చేనేత, మత్స్యకార, కల్లుగీత కార్మికులకు 50ఏళ్లకే పెన్షన్ ఇచ్చామని లోకేష్ తెలిపారు. శాసనసభలో తీర్మానం చేసి బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని కోరామని.. 2019లో టీడీపీ ఓడినా బీసీల కోసం సాధికార కమిటీలు ఏర్పాటు చేసి, వారి గళాన్ని విన్పించేందుకు వేదిక ఏర్పాటుచేశామన్నారు.
Also Read: 100 Billion Dollars : తొలిసారిగా ఒక మహిళకు రూ.8 లక్షల కోట్ల సంపద.. ఎవరు ?