లండన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెట్టుబడిదారుల రోడ్‌షో ఘనంగా జరగనుంది. ఈ రోజు (సెప్టెంబర్ 16) సాయంత్రం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్, పల్ మాల్ వేదికగా నిర్వహించే ఈ కార్యక్రమంలో 150కి పైగా గ్లోబల్ కంపెనీల CEOలు, పెట్టుబడి నిధుల ప్రతినిధులు పాల్గొననున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోడ్‌షో(AP IT Minister Nara Lokesh)కు నాయకత్వం వహించి, ఆంధ్రప్రదేశ్‌లోని పరిశ్రమల అవకాశాలు, పెట్టుబడి వాతావరణం, కొత్తగా అమలు చేస్తున్న పరిశ్రమల విధానాలను వివరించనున్నారు.
ITR Filing Due Date: ఐటీఆర్ ఫైల్ చేయనివారికి మరో ఛాన్స్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
గత ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.10,06,799 కోట్ల విలువైన 122 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఒక లక్ష ఎకరాలకు పైగా భూమిని కొత్త పరిశ్రమల క్లస్టర్ల కోసం కేటాయించింది. ఈ పెట్టుబడులను రెండింతలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే సుస్థిర పరిశ్రమల అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్నోవేషన్, పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని లోకేష్ రోడ్‌షోలో స్పష్టతనివ్వనున్నారు.
ఈ రోడ్‌షోలో ఎరిక్సన్, సైయెంట్, ఇవాంటే గ్లోబల్, AI ఓపెన్‌సెక్ వంటి అగ్రగామి సంస్థలతో పాటు, హిందూజా గ్రూప్, రోల్స్ రాయిస్ గ్రూప్ వంటి బిజినెస్ దిగ్గజాలతో వన్-ఆన్-వన్ సమావేశాలు జరగనున్నాయి. లండన్ చాంబర్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. ఈ గ్లోబల్ అవుట్‌రీచ్ కార్యక్రమం రాబోయే నవంబర్ 14–15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2025కి వేడి వేడిగా బాటలు వేయనుంది.