AP : నారా లోకేశ్ కు ముందస్తు బెయిల్ మంజూరు..

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో వచ్చే నెల 4 వరకు లోకేష్‌ను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు లోకేష్ కు స్వల్ప ఊరట లభించినట్లే అని చెప్పాలి

Published By: HashtagU Telugu Desk
lokesh sensational comments

lokesh sensational comments

స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఫైబర్‌నెట్‌ కేసుల్లో (Skill development , Fibernet Case) ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh) లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అక్టోబరు 4వ తేదీ (బుధవారం) వరకు వాయిదా వేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో వచ్చే నెల 4 వరకు లోకేష్‌ను అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు లోకేష్ కు స్వల్ప ఊరట లభించినట్లే అని చెప్పాలి.

మరో వైపు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ నారా లోకేష్ తరపు న్యాయవాదులు శుక్రవారంనాడు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. మరోవైపు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ కు 41ఏ నోటీసులు ఇవ్వాలని సీఐడీని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Read Also : I Am With Babu: రేపు జగన్ ప్యాలెస్ దద్దరిల్లిపోయేలా ‘మోత మోగిద్దాం’

  Last Updated: 29 Sep 2023, 03:55 PM IST