నారా లోకేష్ (Nara Lokesh) అసెంబ్లీ లో దూకుడు మరింత పెంచారు. ప్రత్యర్థుల విమర్శలకు , ఆరోపణలకు అంతే దీటుగా సమాధానం ఇస్తూ వారి నోరు మోయిస్తున్నారు. ఈరోజు మంగళవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మొదలు అయ్యింది. ఇందులో భాగంగా శాసనమండలిలో వైసీపీ సభ్యురాలు వరుదు కల్యాణి ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ (YCP) సభ్యులకు సమాధానం చెప్పేందుకు సహచర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, సవితలతో కలిసి లోకేశ్ మండలికి వచ్చారు.
Samsung Tri Fold Phone: మూడు మడతలతో శాంసంగ్ ఫోన్.. ఫీచర్లు ఇవీ
ఈ సందర్భంగా ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ… కేంద్రానికి తన మద్దతు ఉపసంహరిస్తే మోదీ సర్కారు ఏపికి ఏం చేయాలన్నా చేస్తుందని తెలిపారు. అంతటి మంచి అవకాశాన్ని కూటమి సర్కారు ఎందుకు వినియోగించుకోలేకపోతోందని కూడా ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా కల్యాణి వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పిన లోకేశ్… తాము ఎన్డీఏతో ఎన్నికలకు ముందే కలిశామని తెలిపారు. ఏపీకి అండగా నిలవాలన్న ఏకైన అజెండాతోనే అన్ కండీషనల్ మద్దతును బీజేపీకి ఇచ్చామని తెలిపారు.
AP Assembly : వైసీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం
లోకేశ్ మాట్లాడుతుండగా వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని, రాష్ట్రంలో 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనికి లోకేష్ వివరణ ఇస్తూ.. పెట్టుబడులు పెట్టగానే ఉద్యోగాలు వస్తాయని తాము చెప్పడంలేదన్నారు. పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటవుతాయని, వాటితో పాటు అనుబంధ సంస్థలలో యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 22 ఎంపీ సీట్లను రాష్ట్ర ప్రజలు ఇస్తే ఏం చేశారని లోకేశ్ విపక్షాన్ని ప్రశ్నించారు. నాడు సరిపడినన్ని ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న మీ పార్టీ అధినేత జగన్… ఎన్నికల తర్వాత ఏం చేశారని ఆయన నిలదీశారు. దళితులకు గుండు కొట్టించిన వాళ్ళు ఎవరు, డోర్ డెలివరీలు చేసింది ఎవరో అందరికీ తెలుసునంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ వైసీపీ సభ్యులపై మండిపడ్డారు. దళితులపై దమనకాండ చేసి, వారి గురించి మీరా మాట్లాడేది? అంటూ నిప్పులు చెరిగారు. అనవసర రాద్ధాంతం చేయొద్దని, సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని వైసీపీ సభ్యులకు నారా లోకేష్ సూచించారు.