Lokesh : తమిళనాడులో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం

Nara Lokesh: టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) తమిళనాడులో(Tamil Nadu) ఎన్నికల ప్రచారం(Election campaign)నిర్వహించనున్నారు. టీడీపీ ఇప్పుడు ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా మారిన నేపథ్యంలో… కోయంబత్తూరు(Coimbatore) ఎంపీ అభ్యర్థి, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి(Annamalai Kuppuswamy)కి మద్దతుగా నారా లోకేశ్ నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ నేపథ్యంలో, లోకేశ్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు బయల్దేరారు. అక్కడ […]

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh Congratulates Team

Nara Lokesh Congratulates Team

Nara Lokesh: టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) తమిళనాడులో(Tamil Nadu) ఎన్నికల ప్రచారం(Election campaign)నిర్వహించనున్నారు. టీడీపీ ఇప్పుడు ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా మారిన నేపథ్యంలో… కోయంబత్తూరు(Coimbatore) ఎంపీ అభ్యర్థి, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి(Annamalai Kuppuswamy)కి మద్దతుగా నారా లోకేశ్ నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నేపథ్యంలో, లోకేశ్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు బయల్దేరారు. అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాల్లో లోకేశ్ ప్రచారం చేయనున్నారు. ఈరోజు రాత్రి 7 గంటలకు పీలమేడు ప్రాంతంలో తమిళనాడు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.

Read Also:Kaushik Reddy : పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలఫై పాడి కౌశిక్ కీలక వ్యాఖ్యలు

రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు సింగనల్లూర్ ఇందిరా గార్డెన్స్ లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమై అన్నామలై విజయానికి సహకరించాలని కోరతారు. అనంతరం కోయంబత్తూరు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం తిరిగొస్తారు. కాగా, రేపు సాయంత్రం యథావిధిగా మంగళగిరి నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

  Last Updated: 11 Apr 2024, 04:53 PM IST