ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం (NDA ) సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చి 50 రోజులు ( 50 Days Ruling) పూర్తి చేసుకుంది. అధికారంలోకి రావడమే ఆలస్యం ఎన్నికల హామీలను , రాష్ట్ర అభివృద్ధి ఫై దృష్టి సారించి పాలన కొనసాగిస్తున్నారు. పెన్షన్ల పెంపు , ఉచిత ఇసుక తదితర హామీలను నెరవేర్చారు. ప్రస్తుతం ఫోకస్ అంత పోలవరం పూర్తి , అమరావతి రాజధాని , రోడ్ల అభివృద్ధి తదితర వాటిపై పెట్టారు. ఈ క్రమంలో మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ (Jagan)..కూటమి 50 రోజుల పాలన ఫై ట్వీట్ చేసారు.
” కేవలం 50 రోజుల్లోనే ఈ ప్రభుత్వం అన్నింటా వైఫల్యం చెందింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ అరాచకపాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతోంది. ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోంది అంటే.. ఈ ఏడాది, అంటే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్ కూడా ప్రవేశపెట్టలేక పోతోంది. దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్ ఆన్ ఎక్కౌంట్ మీదే నడుస్తోంది అంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుంది ” అంటూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
జగన్ చేసిన పోస్ట్ కు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ గారికి ఇంకా తత్వం బోధ పడినట్లు లేదు. 50 రోజుల ప్రభుత్వంలో మేం భయంతో ఉండడం కాదు…ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల బాధ్యతతో ఉన్నాం. మీరే ఇంకా భ్రమల్లో ఉన్నారు అని తెలుసుకోండి. మీ మాటల్లో, చేష్టల్లో, కుట్రల్లో అడుగడుగునా అధికారం దూరం అయ్యిందనే మీ బాధ కనిపిస్తోంది. అక్రమార్జన ఆగిపోయిందనే ఆవేదన కనిపిస్తోంది. ఫేక్ రాజకీయం పండడం లేదనే ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. ఉనికి చాటుకోలేకపోతున్నామనే నిస్పృహ కనిపిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఉక్రోషం కనిపిస్తోంది.
జగన్ గారూ….ప్రతిపక్ష హోదా కూడా రాని స్థాయి ఓటమి కట్టబెట్టింది ప్రజలు. దానికి కారణాలు ఇప్పటికైనా తెలుసుకోండి..వాస్తవాలు అంగీకరించండి. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా ఉంటే మొన్న ఎన్నికల్లో 151లో 5 మాయం అయ్యింది….ఇప్పుడు 11 లో ఒకటి మాయం అవుతుంది. శిశుపాలుడు ఎవరో…ఎవరి పాపం పండిందో మొన్న ప్రజలే తేల్చి చెప్పారు. 5 ఏళ్ల పాటు మీరు సాగించిన విధ్వంసాన్ని 50 రోజుల్లోనే మా కూటమి ప్రభుత్వం తుడిచెయ్యలేదంటూ మీరు చేసే విష ప్రచారం ప్రజామోదం పొందదు. ఇక భయం గురించి అంటారా….ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించిన మాకెందుకు భయం? ఎవరిని చూసి భయం? మీ తీరు చూస్తుంటే….మొన్నటి ఓటమి భయం మిమ్మల్ని తీవ్రంగా వెంటాడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది” అంటూ ట్వీట్ చేసాడు.
పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ గారికి ఇంకా తత్వం బోధ పడినట్లు లేదు. 50 రోజుల ప్రభుత్వంలో మేం భయంతో ఉండడం కాదు…ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల బాధ్యతతో ఉన్నాం. మీరే ఇంకా భ్రమల్లో ఉన్నారు అని తెలుసుకోండి. మీ మాటల్లో, చేష్టల్లో, కుట్రల్లో అడుగడుగునా అధికారం దూరం అయ్యిందనే మీ బాధ… https://t.co/m3qStxMhKg
— Lokesh Nara (@naralokesh) July 22, 2024
Read Also : Aarogyasri : ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను సవరించిన తెలంగాణ ప్రభుత్వం
