Site icon HashtagU Telugu

AP : వైసీపీ నేతల తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన నారా బ్రాహ్మణి..

nara brahmani fire on YCP Leaders

nara brahmani fire on YCP Leaders

మొన్నటి వరకు రోడ్లపైకి పెద్దగారని నారా బ్రాహ్మణి (Nara Brahmani)..ఇప్పుడు ప్రజల్లోనే ఉంటుంది. దీనికి కారణం చంద్రబాబు (Chandrababu Arrest) ను అరెస్ట్ చేయడం. స్కామ్ అనేది లేని కేసులో చంద్రబాబు స్కామ్ చేసారని చెప్పి..CID అధికారులు ఆయన్ను జైల్లో పెట్టడం కుటుంబ సభ్యులు , టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. ఓ పక్క అసలు స్కిం లో స్కామ్ అనేది లేదని పక్క ఆధారాలతో రుజువు చేస్తున్నప్పటికీ..ఏసీబీ కోర్ట్ బెయిల్ ఇవ్వకపోవడం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ (Skill Development)కు సంబదించిన యాజమాన్యం అసలు దీనిలో ఎలాంటి స్కామ్ జరగలేదని..అసలు ఈ కేసుకు సంబదించిన ఏ అధికారి మా దగ్గరికి రాలేదని చెపుతున్నారు. నిన్న ఆదివారం కూడా సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ (Ex-MD of Siemens) ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు తెలిపారు. అయినప్పటికీ వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ((Nara Brahmani)) ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, కళ్లు ఉండి కూడా ప్రభుత్వ పెద్దలు వాస్తవాలను చూడలేకపోతున్నారని విమర్శించారు. ప్రభుత్వం, సీఐడీ అధికారులు వ్యక్తం చేసిన సందేహాలు, ఆరోపణలను సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ నివృత్తి చేసేలా ఆదివారం పూర్తి వివరణ ఇచ్చారని బ్రాహ్మణి చెప్పారు. ప్రభుత్వ పెద్దలు మాత్రం కళ్లుండి కూడా చూడలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈమేరకు సోమవారం నారా బ్రాహ్మణి ఓ ట్వీట్ చేశారు. ప్రభుత్వ సంస్థలతో పాటు మల్టినేషనల్ కంపెనీలనూ వైసీపీ అపహాస్యం చేస్తోందని బ్రాహ్మణి విమర్శించారు.

Read Also : Minister KTR : కాంగ్రెస్ గ్యారెంటీల‌పై కేటీఆర్ ట్వీట్‌.. అర్ధ శతాబ్దపు పాలనంతా…?

ఇదిలా ఉంటె సోమవారం మరోసారి జైల్లో ఉన్న చంద్రబాబు ను ఆయన సతీమణి భువనేశ్వరి ములాఖత్ అయ్యారు. ఆమెతో పాటు కోడలు నారా బ్రాహ్మణి, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చంద్రబాబును కలిశారు. అంతకుముందు రాజమండ్రి శ్రీ సిద్ది లక్ష్మీ గణపతి ఆలయంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరతో కలిసి రాజమండ్రి నాళం భీమరాజు వీధిలోని వినాయకుడి ఆలయానికి చేరుకున్న భువనేశ్వరి స్వామివారికి పూజలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం కోసం భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.