Site icon HashtagU Telugu

Chandrababu Arrest : నిరాహార దీక్ష కు సిద్దమైన నారా భువనేశ్వరి

nara bhuvaneshwari hunger strike on Oct 2nd

nara bhuvaneshwari hunger strike on Oct 2nd

చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు..వైసీపీ అరాచకపు పాలనకు వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు , నిరసనలతో హోరెత్తుతుంటే..ఇప్పుడు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అక్టోబర్ 02 న నిరాహార దీక్ష చేపట్టబోతుంది. ఈ విషయాన్నీ స్వయంగా బాలకృష్ణ ప్రకటించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఈరోజు నంద్యాలలో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ (TDP PAC) సమావేశం జరిగింది.

ఈ సమావేశం అనంతరం మీడియా తో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)మాట్లాడారు. సమవేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు అరెస్టును (Chandrababu Arrest) నిరసిస్తూ అక్టోబర్ 2వ తేదీన ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టబోతున్నారని ప్రకటించారు. ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగుతాయన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి పోరాడతామన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, చంద్రబాబును కక్ష పూరితంగా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. రేపటి నుండి పవన్ కళ్యాణ్ చేపడుతున్న వారాహి యాత్రకు టీడీపీ మద్దతు ఇస్తుందన్నారు. యాత్రలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సంపూర్ణంగా పాల్గొంటారని ఈ సందర్బంగా బాలకృష్ణ తెలిపారు.

Read Also : Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్ ఫై హరీష్ రావు మొన్న ఆలా..నేడు ఇలా..ఎందుకో మరి..?