Site icon HashtagU Telugu

Nandigam Suresh : నందిగం సురేష్‌ కు షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు

Nandigam Suresh

ఏపీ (AP)లో ఎన్నికల (Election 2024) వేడి సమ్మర్ వేడి కంటే ఎక్కువగా ఉంది. 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 కు 25 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని వైసీపీ ప్రచారంలోకి దిగితే..ఎక్కడిక్కడే నిరసనలు , చెప్పులు విసరడం , వైసీపీ కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం వంటి సంఘటనలు ఎదురువుతున్నాయి. ఆ మధ్య ఇంటింటికి వైసీపీ కార్యక్రమంలో ఎలాగైతే ప్రజల నుండి వ్యతిరేకత వచ్చిందో..ఇప్పుడు కూడా చాలామంది నేతలకు అలాంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఎంపీ నందిగం సురేష్‌ (Nandigam Suresh) కు సొంత పార్టీ నేతల నుండే వ్యతిరేకత రావడం ఆయన్ను షాక్ కు గురి చేసింది. అద్దంకి నియోజక వర్గం పరిధిలోని బల్లికురువ మండలం, కొప్పెరపాడు గ్రామంలో చర్చి (Church)లోకి పార్టీ జెండాలు, కండువాలతో ఎంపీ సురేష్ వెళ్లారు. నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ హనిమిరెడ్డి (YCP in charge Hanimireddy) తో కలిసి చర్చి లో ప్రార్థనలు నిర్వహించారు. ఇంతలోగా అదే పార్టీకి చెందిన మరో వర్గ మహిళలు (Womens) పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ప్రార్థనలు నిర్వహిస్తున్న ఎంపీని, ఇన్చార్జిని చర్చిలోనుంచి బయటకు వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. ఎంపీ మాటను లెక్కచేయని మహిళలు వెనక్కు తగ్గలేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఎంపీ సురేష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇక మొన్నటికి మొన్న జగన్ ప్రచార రథంపై చెప్పు విసిరినా ఘటన కూడా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలో సీఎం జగన్ చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జగన్ తన వాహనంపై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పు విసిరారు. అయితే.. అది జగన్‌కి తగల్లేదు కానీ, ఆయనకు దగ్గర నుంచి వెళ్లింది. భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Read Also : Pawan Kalyan : జనసేనలో చేరిన మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ