మా ‘బాబు’ సీఎం అయ్యాడు..నా కోరిక తీరిందన్నారు నందమూరి రామకృష్ణ. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) తనయుడు నందమూరి రామకృష్ణ (Nandhamuri Ramakrishna) గురువారం కాలినడకన తిరుమలకు వచ్చారు. చంద్రబాబు (CHandrababu) సీఎం కావాలని గతంలో ఆయన మొక్కుకున్నారు. ఆ మొక్కు చెల్లించుకునేందుకు తిరుమలకు చేరుకున్న అయన..ఈరోజు శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నారు.
దర్శనానంతరం రామకృష్ణ మాట్లాడుతూ బావ నారా చంద్రబాబునాయుడు సీఎం అయితే స్వామివారిని కాలినడకన దర్శించుకుంటానని మెుక్కుకుని ఈ రోజు దర్శించుకోవడం జరిగిందన్నారు. చంద్రబాబును తిరిగి సీఎంను చేసిన ఏపీ ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నానని తెలిపారు. రామకృష్ణ తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దంపతులు కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
Read Also : Nirmala Sitharaman : డిబిటి పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది..!