Balakrishna Slaps His Fan : ప్రచారంలో అభిమాని ఫై చేయి చేసుకున్న బాలకృష్ణ

ఈరోజు ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్ కదిరి చేరుకున్న ఆయన కు పార్టీల నేతలు , అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఓ అభిమాని బాలకృష్ణ తో సెల్ఫీ కోసం అత్యుత్సహం చూపించడంతో బాలకృష్ణ కు కోపం వచ్చింది

  • Written By:
  • Publish Date - April 13, 2024 / 11:10 AM IST

అభిమానులపై బాలకృష్ణ (Balakrishna ) చేయి చేసుకోవడం (Slaps His) అనేది కొత్తమీ కాదు..ఆయన ఏదైనా ఫంక్షన్ కు వచ్చిన , పార్టీ కార్యక్రమం లో పాల్గొన్న సరే ఎవరొకరు బాలయ్య చేతి దెబ్బ తినాల్సిందే. దీనిపై ఎన్ని విమర్శలొచ్చినా బాలకృష్ణ మాత్రం పెద్దగా పట్టించుకోడు. అభిమానా.. కార్యకర్తా.. మరో వ్యక్తా అన్నది అనవసరం.. బయటికి వచ్చినపుడు ఆయన దగ్గర తేడాగా ప్రవర్తిస్తే చేతులు ఊరుకోవు. తాజాగా బాలయ్య మరోసారి తన చేతి దురుసు చూపించాడు. ఒక అభిమానిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. అతడిపై చేయి చేసుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలో ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో అధికార పార్టీ తో పాటు కూటమి పార్టీలు తమ ప్రచారాన్ని స్పీడ్ చేసాయి. ఇప్పటికే చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ లతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తుండగా..హిందూపురం నుండి బరిలోకి దిగిన బాలకృష్ణ..నేటి నుండి తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో చేపట్టనున్న ఈ ప్రచారం కోసం ‘బాలయ్య అన్స్టాపబుల్’ పేరుతో స్పెషల్ బస్సును రూపొందించారు. NDA అభ్యర్థుల తరఫున ప్రచారం (Balakrishna Election Campaign) చేసేందుకు రాయలసీమలో ఆయన పర్యటించనున్నారు. ఈనెల 19న హిందూపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత 25 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటిస్తారు.

ఈ క్రమంలో ఈరోజు ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్ కదిరి చేరుకున్న ఆయన కు పార్టీల నేతలు , అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఓ అభిమాని బాలకృష్ణ తో సెల్ఫీ కోసం అత్యుత్సహం చూపించడంతో బాలకృష్ణ కు కోపం వచ్చింది. అంతే వెంటనే తన చేతికి పని చెప్పారు. అంతే సగటు అభిమాని అక్కడి నుండి పక్కకు వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనలు తరుచు జరుగుతూనే ఉంటాయి. దీనిని అభిమానులు ఏమాత్రం సీరియస్ గా తీసుకోరు. ఈ రకంగా అయినా బాలకృష్ణ తమను తాకిరాని చెప్పి వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంటారు.

Read Also : Borewell : బోరుబావిలో పడిన ఆరేండ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్