MLC Elections: జనసేన నేత నాగబాబు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే నాగబాబు మాట్లాడుతూ..ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పరిపాలనలో ప్రజా సేవ చేసేందుకు గాను, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎన్నికయ్యే అవకాశం కల్పించి నా బాధ్యతను పెంచిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. తనతో పాటుగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కావలి గ్రీష్మ ప్రసాద్, సోము వీర్రాజు, బి. తిరుమల నాయుడు, రవిచంద్ర బీదకు శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: Balakrishna : జూబ్లీహిల్స్లో బాలకృష్ణ ఇంటి ముందు కారు బీభత్సం
నా ఇన్నేళ్ళ రాజకీయ ప్రయాణంలో నాతో కలిసి పని చేసిన సహచరులకు, మిత్రులకు, మీడియా ప్రతినిధులకు, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మొత్తం జనసేన కుటుంబానికి ఆత్మీయ అభినందనలు అని నాగబాబు పోస్ట్ చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా నాతో వెన్నంటి ఉన్న రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, బీజేపీ శాసనపక్ష నేత పి.విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకి ప్రత్యేకమైన అభినందనలు. నా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, లోకం నాగ మాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్ బాబు, సుందరవు విజయ్ కుమార్, వత్సమట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్, బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీకి అభినందనలు తెలిపారు.
కాగా, ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. పోటీ లేకుండానే 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. ఇక, ఏపీలో 2019 ఎన్నికల్లో ఒక్క సీటు నెగ్గిన జనసేన.. గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ క్లీన్ స్వీప్ చేసింది. పోటీ చేసిన 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నాడు. తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా గెలుపొందారు.
Read Also: Jana Sena Foundation Day : జన్మలో జగన్..పవన్ తో పెట్టుకోడు