Jagan : జగన్‌ నీకు సిగ్గు ఉండాలి – జనసేన నేత నాగబాబు

రాష్ట్రపతి పాలన విధించాలనడానికి జగన్‌కు సిగ్గు ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంతకంటే దిగజారకండి అని చెప్పి కొద్దీ ఆయన ఇంకా దిగజారుతున్నారని ఎద్దేవా చేశారు

  • Written By:
  • Publish Date - July 21, 2024 / 06:34 PM IST

వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ (Jagan) ఫై..జనసేన నేత నాగబాబు (Nagababu) ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ లో రాష్ట్రపతి పాలన విధించాలని..రాష్ట్రంలో హత్యలు , దోపిడీలు, అత్యాచారాలు , నేరాలు ఇలా అన్ని పెరిగిపోతున్నాయని..కూటమి సర్కార్ క్రైమ్ ను పెంచి పోషిస్తుందని..దీనిపై ఢిల్లీ లో ఈ నెల 24 న ధర్నా చేస్తానని జగన్ హెచ్చరిక ఫై వరుసగా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో నాగబాబు సైతం ఆదివారం జనసేన కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. అలాంటిదేమి లేదని అబద్దాలు చెప్పారు. కల్తీసారా తాగి చనిపోతే సహజ మరణంగా చిత్రీరించారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. రాష్ట్రపతి పాలన విధించాలనడానికి జగన్‌కు సిగ్గు ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంతకంటే దిగజారకండి అని చెప్పి కొద్దీ ఆయన ఇంకా దిగజారుతున్నారని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పడంలో జగన్‌కు డాక్టరేట్ ఇవ్వాలని చమత్కరించారు.

తనకు పదవులపై కోరిక లేదని స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఆశయాలు నిలబెట్టేందుకు తనకు చేతనైనంత చేస్తానని అన్నారు. తనకు ఓపిక ఉన్నంత వరకు జనసేన కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి రావడం వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఐదేళ్లు ఏపీలో స్వర్ణయుగం నడుస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సారథ్యంలో ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.

Read Also : Sairaj Bahutule: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా కొత్త వ్య‌క్తి.. రేసులో లేకుండా బిగ్ ఆఫ‌ర్ కొట్టేసిన బ‌హుతులే..!

Follow us