AP : కాపు నేతలతో నాగబాబు భేటీ ..

ఏపీ(AP)లో ఎన్నికల (Elections) సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 175 కు 175 సాధించాలని అధికార పార్టీ వైసీపీ (YCP) చూస్తుంటే..జనసేన – టీడీపీ (Janasena-TDP) పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుపాటు , మేనిఫెస్టో తదితర అంశాల ప్రస్తావన పూర్తి అయ్యింది. ఈ తరుణంలో తాజాగా జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు (Nagababu)..కాపు […]

Published By: HashtagU Telugu Desk
Nagababu New Vote Ap

Nagababu New Vote Ap

ఏపీ(AP)లో ఎన్నికల (Elections) సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 175 కు 175 సాధించాలని అధికార పార్టీ వైసీపీ (YCP) చూస్తుంటే..జనసేన – టీడీపీ (Janasena-TDP) పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుపాటు , మేనిఫెస్టో తదితర అంశాల ప్రస్తావన పూర్తి అయ్యింది. ఈ తరుణంలో తాజాగా జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు (Nagababu)..కాపు నేతలతో , ప్రముఖ బిజినెస్ నేతలతో విశాఖ లో భేటీ అయ్యారని తెలుస్తుంది. విశాఖలోని బీచ్‌ రోడ్డులో ఉన్న ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ సాగినట్టుగా సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సమావేశంలో పాల్గొన్నవారికి సెల్ ఫోన్లకు కూడా అనుమతి ఇవ్వకుండా జాగ్రత్త వహించారట నిర్వాహకులు.. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ గెలుపే ప్రధానంగా పనిచేయాలని నిర్ణయించారట. అలాగే సీఎం అభ్యర్థి ఫై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఎవ్వరు పట్టించుకోవద్దని , పదవులపై పవన్ కల్యాణ్‌, చంద్రబాబు నిర్ణయమే ఫైనల్.. తప్ప మిగిలిన నాయకులను పరిగణలోకి తీసుకోవద్దని స్పష్టం చేశారట. రెండు సామాజిక వర్గాలకే ఇంత కాలం అవకాశం లభించినందున ఇప్పుడు మార్పు రావాల్సిందేనని తీర్మానం చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.. అభ్యర్థి ఎవరనే దాని కంటే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ విజయం లక్ష్యంగా పని చేయాలని కాపు నేతలకు, వ్యాపారప్రముఖులను నాగబాబు కోరారట.

Read Also : World Test Championship: WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన టీమిండియా..!

  Last Updated: 05 Jan 2024, 10:47 AM IST