Nagababu : మెగాస్టార్‌తో ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు.. ఆయన్నే అంటున్నారు.. చిరంజీవిపై వైసీపీ విమర్శలకు నాగబాబు కౌంటర్..

వైసీపీ చేస్తున్న విమర్శలకు మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) గట్టి కౌంటర్ ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - August 9, 2023 / 06:00 PM IST

ఇటీవల జరిగిన వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) 200 డేస్ ఈవెంట్ లో చిరంజీవి(Chiranjeevi) మాట్లాడుతూ అంబటి(Ambati Rambabu) – బ్రో(Bro) సినిమా గొడవ గురించి ఇండైరెక్ట్ గా కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధి, రోడ్లు, ప్రత్యేకహోదా గురించి మాట్లాడకుండా సినిమాల మీద పడి ఏడుస్తారెందుకు అంటూ ఏపీ గవర్నమెంట్, అంబటి రాంబాబు పై ఇండైరెక్ట్ గా విమర్శలు చేశారు.

దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో(AP Politics) సంచలనంగా మారాయి. ఇక ఇన్ని మాటలు అన్నాక వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా?? వరుసపెట్టి నిన్నటి నుంచి వైసీపీ మంత్రులంతా ఒక్కొక్కరు ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చిరంజీవిపై విమర్శలు చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే నేను ఒకప్పుడు చిరంజీవి అభిమానినే అంటూ విమర్శలు చేయడం గమనార్హం.

చిరంజీవి ఎలాగో వైసీపీ చేసే విమర్శలకు సమాధానం ఇవ్వరు. దీంతో వైసీపీ చేస్తున్న విమర్శలకు మెగా బ్రదర్ నాగబాబు(Nagababu) గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏ గొడవ జరిగినా దానికి కౌంటర్ గా ముందు ట్విట్టర్ లో ఓ ట్వీట్ వేసేస్తారు నాగబాబు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చిరంజీవి మీద చేస్తున్న విమర్శలపై కూడా స్పందిస్తూ వైసీపీ వాళ్ళకి కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు.

నాగబాబు తన ట్వీట్ లో.. శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అనాపైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి, 24 క్రాఫ్ట్ లకి అన్నం పెడుతున్న ఏకైన పరిశ్రమ చిత్రపరిశ్రమ. ఏ పని లేనోడు పిల్లి తల గొరిగినట్టు.. నిజం మాట్లడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్రా మంత్రులు. ఒకప్పుడు ఆయన ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఇప్పుడు ఆయన మీద కారు కూతలు కూస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీదే పడుతుంది. మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు, అభివృద్ధి అనేదానికి అర్ధమే తెలియదు. బటన్ నొక్కి కోట్లల్లో ముంచి వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా..? అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగిలి లేదనుకుంటున్నారా..! మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటే అర్థం అవుతుంది. మీ ధౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి END CARD దగ్గర్లోనే ఉంది. అంటూ ఫైర్ అయ్యారు. ఇక చివర్లో NOTE: కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుంది. ఆరోగ్యాలు జాగ్రత్త.! అని కొసరు వడ్డించారు నాగబాబు. మళ్ళీ దీనిపై కూడా ప్రెస్ మీట్స్ పెట్టి విమర్శించినా విమర్శిస్తారు వైసీపీ నాయకులు. మరి ఈ మెగా వర్సెస్ వైసీపీ గొడవ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

 

Also Read : Minister Roja : ఇండస్ట్రీ పెద్దగా తమ్ముడికి బుద్ధి చెప్పాల్సింది పోయి రాజకీయాలు మాట్లాడతారా.. చిరంజీవి వ్యాఖ్యలపై రోజా కౌంటర్..