Goa Beach : గోవాలో మరోసారి అనుమానాస్పద మృతిపరిణామం వెలుగు చూసింది. ఈసారి గోవాకు వచ్చిన ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు, ఏం జరిగిందో తెలియక బీచ్‌లో శవమై కనిపించాడు. ఈ ఘటన శనివారం రాత్రి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం, ఈ యువకుడు వెలిగండ్ల మండలం కొట్టాలపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి విజయకుమార్ యొక్క కుమారుడు దినకర్ (34). దినకర్ బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
మూడు రోజుల కిందట పనిమీద గోవాకు వెళ్లిన దినకర్, అక్కడ అనుమానాస్పద పరిస్థితిలో బీచ్‌లో మరణించాడని స్థానిక పోలీసులు గుర్తించారు. వారి ఆధార్ కార్డు వివరాల ఆధారంగా గోవా పోలీసులు వెంటనే వెలిగండ్ల ఎస్సై మధుసూదన్‌రావుకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత, దినకర్ తండ్రి విజయకుమార్, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెంటనే గోవాకు బయలుదేరి వెళ్లారు. అయితే, యువకుడి మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గోవా పోలీసులు ఈ సంఘటనపై అమానాస్పద మృతి కేసు నమోదు చేశారు.
Rohit Sharma Net Worth: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్తి ఎంతో తెలుసా?
ఇటీవల, గోవాలోని కలంగుటే బీచ్‌లో డిసెంబర్ 31న ఒక ఘర్షణ చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెం పట్టణం నుండి వచ్చిన ఎనిమిది మంది యువకులు, హోటల్ సిబ్బందితో ఫుడ్ ఆర్డర్ విషయంలో వాగ్వాదం జరిగిన తర్వాత, హోటల్ సిబ్బంది కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో రవితేజ అనే యువకుడు తీవ్రంగా గాయపడిన తర్వాత అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేసినట్లు నార్త్ గోవా ఎస్పీ అక్షత్ కౌశల్ తెలిపారు. హోటల్ యజమాని, అతని కుమారుడు, సిబ్బంది 4 మందిని అరెస్టు చేశారు.
గోవాలో స్వదేశీ పర్యాటకుల పట్ల స్థానిక వ్యాపారుల దుర్వినియోగం, రెస్టారెంట్ యజమానుల నుంచి హింసాత్మక ప్రవర్తనపై ఇటీవల అనేక వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా గోవాకు వెళ్లే స్వదేశీ టూరిస్టుల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. కొత్త సంవత్సర ఉత్సవాలకు గోవా వెలవెలబోయింది. ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గోవా సీఎం కూడా ఈ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు.
Daaku Maharaaj : బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ట్రైలర్ రిలీజ్.. ట్రైలర్ అదిరిందిగా..