Site icon HashtagU Telugu

YS Sharmila : నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు : వైఎస్ షర్మిల

My son Raja Reddy will enter politics: YS Sharmila

My son Raja Reddy will enter politics: YS Sharmila

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ రోజు కీలక ప్రకటన చేశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి అవసరమైతే రాజకీయాల్లోకి వస్తాడని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చలు గుబాళించాయి. ముఖ్యంగా, వైఎస్ కుటుంబ వారసత్వం తదుపరి తరానికి చేరుతున్న సంకేతంగా ఇది కనిపిస్తోంది. ఈ ఉదయం షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి కర్నూల్ ఉల్లి మార్కెట్‌ను సందర్శించారు. అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడిన ఆమె, ఉల్లి ధరల పతనంపై తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు క్వింటా ఉల్లి రూ.600కి కూడా అమ్ముడవడం లేదు. కానీ గత సంవత్సరం ఇదే ఉల్లి ధర రూ. 4500కి చేరింది అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటా ఉల్లి రూ.1200కి కొనుగోలు చేస్తుందని చెబుతోందని, అయితే రైతులు ఇంకా రూ.600కే ఎందుకు అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం నిజంగా రూ.1200కి కొనుగోలు చేస్తే, రైతులు నష్టపోతుండరుగా? ఈపనికి సమాధానం సీఎం చంద్రబాబు ఇవ్వాలి అని షర్మిల డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలలో మరో కీలక అంశం రైతుల ఆత్మహత్యలు. ఉల్లి ధరల పతనంతో బాధపడి పురుగుల మందు తాగిన ఇద్దరు రైతులపై కేసులు పెట్టడం దారుణమని, ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె హెచ్చరించారు. షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఈ సందర్భంగా ప్రజల ముందుకు రావడం. ఇది ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి సంకేతంగా విశ్లేషిస్తున్నారు. షర్మిల మాట్లాడుతూ..అవసరమైనప్పుడు నా కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడు. అతనిలో నాయ‌క‌త్వ లక్షణాలున్నాయి అని వ్యాఖ్యానించారు.

రాజారెడ్డి, షర్మిల మరియు అనిల్ కుమార్ పెద్ద కుమారుడు. 1996లో జన్మించిన ఆయన హైదరాబాద్‌లోని ఓక్‌రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసి, తరువాత యునైటెడ్ స్టేట్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ప్రస్తుతం అమెరికాలో ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కేవలం విద్యాబ్యాసం గాకుండా, రాజారెడ్డి గతంలోనే తన తల్లి షర్మిలతో కలిసి రాజకీయ ప్రచారాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా, తెలంగాణాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆయనలో రాజకీయ ఆసక్తి ఉన్నదని స్పష్టమవుతోంది. ప్రస్తుతం కర్నూల్ పర్యటనకు ముందు ఆయన అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారని తెలిసింది. ఇది అధికారిక రాజకీయ ప్రవేశానికి ముందుగానే గ్రౌండ్ వర్క్ వేసినట్లుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశం వైఎస్ కుటుంబ వారసత్వానికి నూతన దిశగా మారుతుందనడంలో సందేహం లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాలలో స్థిరమైన స్థానం ఏర్పరుచుకున్న తరుణంలో, ఆయన మనవడు రాజకీయంగా ముందుకు రావడం రాజకీయంగా సెన్సేషన్‌గా మారింది. వైఎస్ కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతున్న ఈ వారసత్వ పరంపర ఇప్పుడు మరో తరానికి విస్తరించనుంది. ఇది వైఎస్ అభిమానులలో ఆనందాన్నీ, ప్రత్యర్థుల్లో ఆందోళననూ కలిగిస్తోంది. ఇదే సమయంలో, షర్మిలకు రాజకీయంగా కొత్త ఊపునిస్తుంది.

Read Also: KTR : కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది