Putta Sudhakar Yadav: నా కొడుకు మహేష్ కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్

Putta Mahesh Kumar  తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ అయిన మెయినాబాద్ డ్రగ్స్ కేసు ఎపిసోడ్‌పై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు. మహేష్‌కు హార్ట్ సర్జరీ చేశారని.. అలాంటప్పుడు డ్రగ్స్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. తన కుమారుడు 100 శాతం ఎలాంటి తప్పు చేయలేదన్నారు. త్వరలోనే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని.. కేసు విచారణ తర్వాత పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని అన్నారు. హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ […]

Published By: HashtagU Telugu Desk
Putta Sudhakar Yadav

Putta Sudhakar Yadav

Putta Mahesh Kumar  తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ అయిన మెయినాబాద్ డ్రగ్స్ కేసు ఎపిసోడ్‌పై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు. మహేష్‌కు హార్ట్ సర్జరీ చేశారని.. అలాంటప్పుడు డ్రగ్స్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. తన కుమారుడు 100 శాతం ఎలాంటి తప్పు చేయలేదన్నారు. త్వరలోనే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని.. కేసు విచారణ తర్వాత పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని అన్నారు.

హైదరాబాద్ మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ కాగా.. ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. వెంటనే ఎంపీ మహేష్ కుమార్ అధిష్టానానికి డ్రగ్స్ పార్టీ అంశంపై వివరణ ఇచ్చారు. తాజాగా ఈ ఎపిసోడ్‌పై మహేష్ తండ్రి, మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ స్పందించారు.

తన కుమారుడు మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకోలేదని, ఆయన ఎలాంటి తప్పు చేయలేదని పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. మహేష్‌కు 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగిందని, అప్పటి నుంచి డాక్టర్లు జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారన్నారు. అలాంటిది తన కుమారుడు డ్రగ్స్ ఎలా తీసుకుంటాడని ప్రశ్నించారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో మహేష్ కుమార్‌కు అన్ని రకాల టెస్టులు చేయించామని, అన్ని నెగిటివ్ రిపోర్టులు వచ్చాయన్నారు. టీడీపీ అధిష్టానానికి అన్ని విషయాలు వివరించామని చెప్పుకొచ్చారు. ఇక పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

మహేష్‌కు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని సుధాకర్ యాదవ్ అన్నారు. మెయినాబాద్‌లో పార్టీ ఉందని పిలిస్తేనే తన కుమారుడు వెళ్లారని, కానీ అక్కడ పరిస్థితులు చూసి మహేష్ వెంటనే బయటకు వద్దామనుకున్నాడని, కానీ కారు లేకపోవడం వల్ల అక్కడే ఉండిపోయాడని వివరించారు. టెస్ట్ కోసం మహేష్ బ్లడ్ తీసుకోకుండా పాజిటివ్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. బ్లడ్ తీసుకుని టెస్ట్‌కు పంపిస్తే రిపోర్ట్ రావడానికి 48 గంటల సమయం పడుతుందని, తాము మహేష్‌కు ఢిల్లీ ఎయిమ్స్‌లో టెస్ట్ చేయిస్తే 48 గంటల తర్వాత రిపోర్ట్ వచ్చిందని అన్నారు. అలాంటిది కొన్ని గంటల వ్యవధిలోనే బ్లడ్ రిపోర్ట్ ఎలా వచ్చిందని అనుమానం వ్యక్తం చేసేలా మాట్లాడారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నానని, ఈ కేసులో విచారణ పూర్తైన తర్వాత ఆధారాలతో సహా మీడియా ముందుకు వస్తామని సుధాకర్ యాదవ్ చెప్పుకొచ్చారు.

హైదరాబాద్‌లోని మెయినాబాద్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్ పార్టీ వ్యవహారం సంచలనంగా మారింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయనకు మొదట యూరిన్ శాంపిల్స్‌లో నెగిటివ్ రిపోర్ట్ రాగా, బ్లడ్ శాంపిల్‌లో పాజిటివ్ తేలిందని అన్నారు. అయితే పుట్టా మహేష్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ కావడంతో, షోకాజ్ నోటీసు ఇవ్వడంతో ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో వివరిస్తూ పుట్టా మహేష్ టీడీపీ అధిష్టానానికి వివరణ ఇచ్చారు.

 

  Last Updated: 23 Mar 2026, 02:32 PM IST