Site icon HashtagU Telugu

Murder : తాడేపల్లిగూడెంలో దారుణం.. భార్యను హత్య చేసిన క‌సాయి భ‌ర్త

Murder

Murder

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దారుణం జ‌రిగింది. వీరంపాలెం గ్రామంలో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. వివరాల్లోకి వెళితే గంజి డేవిడ్, నిర్మల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న డేవిడ్‌ భార్యతో గొడవ పడ్డారు. ఉపాధి నిమిత్తం నిర్మల కువైట్ వెళ్లింది. ఈ క్రమంలో డేవిడ్ ఇద్దరు కూతుళ్లను చిత్రహింసలకు గురిచేస్తూ, కత్తితో పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. అయితే, భర్త నుండి చిత్రహింసల వీడియో అందుకున్న నిర్మల గ్రామ సర్పంచ్‌కి ఫిర్యాదు చేసింది. స‌ర్పంచ్ ఈ విష‌యాన్ని పోలీసుల‌కు తెలిప‌గా.. వెంటనే చిన్నారి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో డేవిడ్ జైలుకు కూడా వెళ్లాడు. నిర్మల కూడా కువైట్ నుంచి వచ్చి వాళ్ల‌ అమ్మ ఇంట్లో ఉంటోంది. డేవిడ్‌ బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. తన భార్య వద్దకు వెళ్లి ఇక‌పై తాను మంచిగా ఉంటాన‌ని చెప్పి భ‌ర్య‌ను మూడు రోజుల క్రితం వీరంపాలెంలోని తన ఇంటికి తీసుకొచ్చాడు. డేవిడ్ త‌న తీరు మార్చుకోకుండా గురువారం రాత్రి మళ్లీ నిర్మలతో గొడవపడి శుక్రవారం ఉదయం భార్యను హత్య చేశాడు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.