Murder Attempt On KA Paul : కేఏ పాల్‌పై హత్యాయత్నం..?

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఫై హత్యాయత్నం (Murder Attempt) జరిగిందనే ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వీర్ల గా మారింది. ఫుడ్ లో విషం కలిపి ఆయన్ను చంపేందుకు ట్రై చేసినట్లు స్వయంగా పాల్ మాట్లాడినట్లు ఓ ఆడియో క్లిప్ (Audio Leak) హాట్ టాపిక్ గా మారింది. క్రిస్మస్ వేడుకల (Christmas Celebrations) సమయంలో డిసెంబర్ 25న తనను చంపే ప్రయత్నం జరిగిందని పాల్ ఆరోపించారు. క్రిస్మస్ […]

Published By: HashtagU Telugu Desk
Murder Attempt On Ka Paul

Murder Attempt On Ka Paul

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఫై హత్యాయత్నం (Murder Attempt) జరిగిందనే ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వీర్ల గా మారింది. ఫుడ్ లో విషం కలిపి ఆయన్ను చంపేందుకు ట్రై చేసినట్లు స్వయంగా పాల్ మాట్లాడినట్లు ఓ ఆడియో క్లిప్ (Audio Leak) హాట్ టాపిక్ గా మారింది. క్రిస్మస్ వేడుకల (Christmas Celebrations) సమయంలో డిసెంబర్ 25న తనను చంపే ప్రయత్నం జరిగిందని పాల్ ఆరోపించారు. క్రిస్మస్ పండుగ వేళ టార్గెట్ చేసుకుని.. తనకు ఫుడ్ పాయిజన్ (Food Poisoning) అయ్యేలా చేశారని పాల్ ఆరోపణలు చేయడం గమనార్హం. ఫుడ్ పాయిజనింగ్ తరువాత ప్రస్తుతం కోలుకుంటున్నానని కేఏ పాల్ వెల్లడించారు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా రహస్యంగా విశాఖలో చికిత్స పొందుతున్నట్లు కేఏ పాల్ అన్నట్లుగా ఆ ఆడియోలో ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ఫుడ్ పాయిజనింగ్ తర్వాత ప్రస్తుతం కోలుకుంటున్నానని.. దేవుడి దయ వల్ల ప్రాణాలతో బతికి బయటపడ్డానంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయం చెప్పొచ్చో.. లేదోనని ఇన్ని రోజులు తాను మౌనంగా ఉన్నట్లు.. పది రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నట్లు.. కాన్ఫిడెన్షియల్‌గా చికిత్స తీసుకుంటున్నట్లు ఆ ఆడియోలో ఉంది. రాజకీయ కుట్రలతో తనపై హత్యాయత్నం జరిగిందని కేఏ పాల్ చెప్పినట్లుగా ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇలా తనపై విష ప్రయోగం జరిగిందని కేఏ పాల్ పేరుతో ఆడియో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. మెడికో ప్రీతి కేసు, ఇతర ప్రభుత్వాల వైఫల్యాలపై గట్టిగా ప్రశ్నించినందుకు తనను టార్గెట్‌ చేశారని.. అందుకే తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ.. ఆ మధ్య కేఏ పాల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఐతే ఇప్పుడు విషప్రయోగం అంటూ మళ్లీ ఆడియో వైరల్‌గా మారడం కలకలం రేపుతోంది. మరి నిజంగా ఇది జరిగిందా..లేక పాల్ కావాలని పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also : MLA Kapu Ramachandra Reddy Resign : వైసీపీ లో మరో వికెట్ డౌన్

  Last Updated: 05 Jan 2024, 08:28 PM IST